Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ అచ్చం అతనిలానే బ్యాటింగ్ చేస్తాడు.. అందుకే అలా: గవాస్కర్

Virat kohli bats exactly like him: Sunil Gavaskar draws similarity between Kohli and Sir Viv Richards


ఢిల్లీ:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అచ్చం వెస్టిండీస్ దిగ్గ‌జం స‌ర్ వివ్ రిచ‌ర్డ్స్‌లా బ్యాటింగ్ చేస్తాడు అని భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్ అన్నారు. రిచ‌ర్డ్స్ క్రీజులో నిలిస్తే ప‌రుగులు చేయ‌కుండా ఆప‌డం చాలా కష్టంగా ఉండేదని, ఇప్పుడు విరాట్ కూడా అలానే ఆడుతున్నాడన్నాడు. మైదానానికి రెండు వైపులా బౌండ‌రీలు బాదేందుకు ఉప‌యోగించే భారత కెప్టెన్ టెక్నిక్ అద్భుమ‌ని సన్నీ ప్ర‌శంసించారు.
 అచ్చం రిచ‌ర్డ్స్‌లా బ్యాటింగ్ చేస్తాడు:

అచ్చం రిచ‌ర్డ్స్‌లా బ్యాటింగ్ చేస్తాడు:

తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'వివ్ రిచ‌ర్డ్స్ క్రీజులో నిలిస్తే ఆప‌డం చాలా క‌ష్టం. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం అలాగే క‌నిపిస్తున్నాడు. ఒకే లైన్‌లో ఒకేలా వ‌చ్చే బంతిని ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్‌లో బౌండ‌రీ బాదేందుకు పై చేతిని.. మిడాన్‌, మిడాఫ్‌లో త‌ర‌లించేందుకు కింది చేతిని ఉప‌యోగిస్తాడు. అందుకే విరాట్‌ను ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మ‌న్‌గా కీర్తిస్తారు. ఎందుకంటే అత‌డు అచ్చం రిచ‌ర్డ్స్‌లా బ్యాటింగ్ చేస్తాడు. గ‌తంలో గుండ‌ప్ప విశ్వ‌నాథ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అలా బ్యాటింగ్ చేసేవాళ్లు' అని చెప్పారు.

 లయ తప్పకూడదనే:

లయ తప్పకూడదనే:

అంత‌కు ముందు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ సైతం రిచ‌ర్డ్స్‌, కోహ్లీ బ్యాటింగ్‌ను పోల్చిన సంగ‌తి తెలిసిందే. రిచ‌ర్డ్స్‌ సుదీర్ఘ ఫార్మాట్లో ఆడే క్రికెటింగ్‌ షాట్ల‌నే ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్లోనూ ఉప‌యోగించి వేగంగా ప‌రుగులు చేసేవాడ‌ని, కోహ్లీ సైతం టీ20, వ‌న్డే, టెస్టుల‌న్న తేడా లేకుండా సంప్ర‌దాయ షాట్ల‌నే ఎంచుకుంటాడ‌న్నారు. 'కోహ్లీ బ్యాటింగ్‌ తీరు నాకిష్టం. భారత్ చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అతడిని మేం ఇంటర్వ్యూ చేశాం. పొట్టి క్రికెట్లో కొత్తతరం, ఫ్యాన్సీ షాట్లు ఎందుకాడవని ప్రశ్నించాం. సుదీర్ఘ ఫార్మాట్లో లయ తప్పకూడదనే ఆ షాట్లు ఆడనని మాతో చెప్పాడు. నా తరంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో వివ్‌ రిచర్డ్స్‌ అత్యుత్తమం. అతను సాధారణ క్రికెట్‌ షాట్లే ఆడేవాడు. బంతిని చక్కగా మిడిల్‌ చేస్తూ.. వేగంగా పరుగులు సాధించేవాడు. కోహ్లీ కూడా అలానే ఆడుతున్నాడు. సంప్రదాయ షాట్లనే కచ్చితత్వంతో ఆడతాడు' అని ఛాపెల్‌ పేర్కొన్నారు.

21వేల‌కు పైగా ప‌రుగులు:

21వేల‌కు పైగా ప‌రుగులు:

2008లో అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ కైవ‌సం చేసుకున్న విరాట్ కోహ్లీ నేరుగా భార‌త జ‌ట్టులో ప్ర‌వేశించాడు. అప్ప‌టి నుంచి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. అత్యంత నిల‌క‌డ‌గా ఆడుతూ స‌చిన్ టెండూల్కర్ ఘ‌న‌త‌ల‌ను చెరిపేస్తున్నాడు. 86 టెస్టులు, 248 వ‌న్డేలు, 82 టీ20లు ఆడిన విరాట్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 21వేల‌కు పైగా ప‌రుగులు చేశాడు. ఇక వంద శ‌త‌కాల ఘ‌న‌త‌కు వేగంగా చేరువవుతున్నాడు.

70 సెంచరీలు:

70 సెంచరీలు:

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

బాయ్‌కి హెచ్‌ఎస్ ప్రణయ్‌ క్షమాపణలు!!

Story first published: Wednesday, June 24, 2020, 9:41 [IST]
Other articles published on Jun 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+