సూర్య.. ఆ రికార్డు కొట్టేద్దామనుకున్నావా?.. అయ్యో బ్రో.. నవ్వులే నవ్వులు ! (వీడియో)

దుబాయ్: ఆసియాకప్ 2022లో టీమిండియా జోరు కొనసాగుతోంది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన రోహిత్ సేన గ్రూప్-ఏ టాపర్‌గా సూపర్-4కు అర్హత సాధించింది. పాకిస్థాన్‌తో అద్భుత విజయం అందుకున్న టీమిండియా.. హాంగ్ కాంగ్‌పై అదే జోరును కొనసాగించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరూ బీసీసీఐ టీవీతో సరదాగా చిట్‌చాట్ చేశారు.
రికార్డు కొట్టేద్దామనుకున్నావా?
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ... సూర్యకుమార్ యాదవ్‌కు ఆసక్తికర ప్రశ్న వేసాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సూర్య హ్యాట్రిక్ సిక్స్‌లతో మొత్తం 4 సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలోనే ఆఖరి ఓవర్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టాలనుకున్నావా? ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా చరిత్రకెక్కుదామనుకున్నవా? అని కోహ్లీ అడిగాడు.
దీనికి సూర్య తనదైన శైలిలో బదులిచ్చాడు. తన శక్తిమేరకు ఆడాలనుకున్నా.. కానీ ఈ రికార్డు అందుకోవాలని, యువీ పాను అధిగమించాలని అనుకోలేదు బ్రో అని సమాధానమిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. దీనికి కోహ్లీ స్పందిస్తూ.. అవును యువీ పా ఆడింది మ్యాజికల్ ఓవర్అని, ముఖ్యంగా బ్రాడ్‌ను ఉతికారేసాడని చెప్పుకొచ్చాడు.

సూర్య ఆట అద్భుతం..
ఇక సూర్య ఆటను దగ్గరుండి చూడటం తనకు ఇదే తొలిసారని, అతని ఆటను ఆస్వాదించానని కోహ్లీ తెలిపాడు. వెంటనే సూర్య మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని, అతని వల్లనే తాను ఫ్రీగా ఆడగలిగానని చెప్పాడు. అతను నిదానంగా ఆడి మంచి ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేయడంతోనే తాను ధాటిగా ఆడే అవకాశం దక్కిందన్నాడు. చివర్లో ఇద్దరూ కలిసి అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది.

సూర్య సునామీ
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. రోహిత్(26), రాహుల్(36) పర్వాలేదనిపించారు. హంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్‌ఫర్ తలో వికెట్ తీసారు. 18 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అఫ్గాన్.. సూర్య సునామీ ఇన్నింగ్స్‌తో లయ తప్పింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్ హయత్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), కించిత్ షా(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications