కోహ్లీ తస్మాత్ జాగ్రత్త.. మాస్క్ లేకుంటే కరోనా వదలదు

న్యూఢిల్లీ : కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుదామా.. అని తహతహలాడుతున్నాడు. ఏమాత్రం ఊహించని ఈ విశ్రాంతిని కుటుంబ సభ్యులతో ఆస్వాదించిన విరాట్.. ఫిట్‌నెస్‌పై కూడా శ్రద్ద పెట్టాడు. ఇప్పటికే ఫిట్‌నెస్ కోసం తాను చేస్తున్న కసరత్తులకు సంబంధించిన వీడియోలను షేర్ చేశాడు.
తాజాగా మరో వీడియోను పంచుకొని క్యాప్షన్ ఇవ్వాలని అభిమానులను కోరాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. తన నివాసంలోనే పరిగెడుతున్న వీడియోకు ఎడిటింగ్ స్కిల్స్ జోడించి ట్విటర్,ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఫాస్ట్ రన్నింగ్ మూమెంట్‌ను పార్ట్స్‌గా విభజింజి స్లోమూమెంట్స్‌ను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'నా రన్నింగ్ మూమెంట్ క్యాప్షన్ ఇవ్వాలని' కోహ్లీ అభిమానులను అడిగాడు.
ఇక కోహ్లీ పెట్టిన క్యాప్షన్‌పై అభిమానులు, పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు స్పందించారు. 'చాలా చక్కగా ఎడిట్ చేశావ్ కోహ్లీ' అంటూ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. బాలీవుడ్ నటుడు కునాల్ కేము స్పందిస్తూ..' ఇది సరిపోదు.. నీ నుంచి చాలా ఆశిస్తున్నా' అంటూ తెలిపాడు. ' కోహ్లి.. చిరుత కన్నా వేగంగా పరిగెత్తావు' అంటూ కోహ్లి అభిమానులు పేర్కొన్నారు. ఇక ప్రఖ్యాత యూట్యూబర్, హాస్యనటుడు భువన్ బామ్ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. 'మాస్క్‌లు లేకుండా బయట తిరిగితే కరోనా పట్టేస్తుంది'అని కోహ్లీ సరదాగా హెచ్చరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications