విరుష్క సెలబ్రేషన్స్:
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి ముగిసేలోగా తాము ముగ్గురం కాబోతున్నామంటూ అనుష్కతో కలిసి దిగిన ఫోటోని కోహ్లీ షేర్ చేశాడు. దీంతో విరుష్క జోడీకి క్రికెట్, బాలీవుడ్ స్టార్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపించారు. శుక్రవారం ఆర్‌సీబీ ఆటగాళ్ల క్వారంటైన్ ముగియడంతో అందరు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్‌సీబీ ఆటగాళ్ల మధ్య కోహ్లీ కేక్ కట్ చేసి తన శ్రీమతికి తినిపించాడు. అలానే అనుష్క కూడా విరాట్‌కి కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కోహ్లీకి అందరూ విషెష్ చెప్పారు.

కేక్ కట్ చేసిన చహల్:
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇటీవల తన మనసుకు నచ్చిన అమ్మాయి ధనశ్రీ వర్మతో నిశ్చితార్ధం జరుపుకున్న విషయం తెలిసిందే. దీంతో చహల్ కూడా తోటి ఆటగాళ్ళ మధ్య కేక్ కట్ చేశాడు. అందరూ అతనికి విషెష్ చెప్పి కేక్ తినిపించారు. అయితే వీలైనంత మేరకు ఆటగాళ్లు భౌతిక దూరం పాటించారు. శిబిరంలో ఎక్కడ చూసినా ఆహ్లాదం.. ఆనందం.. ఆస్వాదనే కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ అఫీషియల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కోహ్లీసేన మొత్తం ఏకాంతానికే:
దుబాయ్‌కు ప్రయాణమయ్యే ఏడు రోజులు ముందు వరకు బెంగళూరులోని శిబిరంలో కోహ్లీసేన మొత్తం ఏకాంతానికే పరిమితమైంది. ఒకరినొకరు కలవలేదు. చూసుకోలేదు. ప్రత్యక్షంగా మాట్లాడుకోలేదు. కేవలం తమకు కేటాయించిన గదులకే పరిమితం అయ్యారు. ఇక దుబాయ్ చేరుకున్నా బెంగళూరు ఆటగాళ్లు మళ్లీ ఆరు రోజులు ఏకాంతవాసమే గడిపారు. కఠిన నిబంధనలు పాటించారు. పక్కపక్క గదుల్లోనే ఉన్నా ఎవ్వరూ ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఫోన్లలో మాట్లాడుకున్నారు. బబుల్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ఒక్కరు చేసే తప్పుతో అంతా నాశనం అవుతుందని కెప్టెన్ విరాట్, ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ ఆటగాళ్లను హెచ్చరించారు.
బీసీసీఐ మూడు చెబితే.. ఆర్‌సీబీ ఆరుసార్లు:
దుబాయ్‌లోని ఆరు రోజుల సమయంలో 1, 3, 6వ రోజు కరోనా వైరస్ పరీక్షలు పూర్తయ్యాయి. బీసీసీఐ మూడు చెబితే.. ఆర్‌సీబీ ఆరుసార్లు టెస్టులు చేయించింది. సిబ్బందితో సహా అందరూ నెగెటివ్‌గా తేలారు. అందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారని నిర్ధరించుకున్న తర్వాత ఆర్‌సీబీ అందరినీ కలుసుకొనేందుకు అవకాశమిచ్చింది. అప్పుడు ఆటగాళ్లు మాట్లాడుకున్నారు, కలిసి భోజనం చేశారు. శుక్రవారం సాయంత్రం సాధన కూడా చేశారు. ఆపై కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టారు.
IPL 2020: నిజమే.. 13మందికి కరోనా పాజిటివ్.. బీసీసీఐ అధికారిక ప్రకటన!!


Click it and Unblock the Notifications
