IPL 2020: నిజమే.. 13మందికి కరోనా పాజిటివ్.. బీసీసీఐ అధికారిక ప్రకటన!!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం యూఏఈకి వెళ్లిన ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయ సిబ్బంది కరోనా బారినపడ్డారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన వారిలో మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అందులో ఇద్దరు ప్లేయర్లు ఉన్నారని స్పష్టం చేసింది. ఇటీవల 1,988 కరోనా పరీక్షలు జరపగా.. 13 మంది కరోనా బారినపడినట్టు గుర్తించామని తెలిపింది.

నిజమే.. 13 మందికి కరోనా:
'యూఏఈలో ఐపీఎల్ 2020లో పాల్గోనే అన్ని జట్లకు చెందిన 1,988 మందికి ఆగస్టు 20 నుంచి 28 వరకూ ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్ పరీక్షలు జరిపాం. వారిలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్ మేనేజిమెంట్, బీసీసీఐ సిబ్బంది, ఐపీఎల్ ఆపరేషనల్ టీమ్, హోటల్, గ్రౌండ్ ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది ఉన్నారు. 13 మందికి కరోనా సోకగా.. వీరిలో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. కరోనా బాధితులతో పాటు వీరితో దగ్గరగా కాంటాక్ట్ అయిన వారికి ఎలాంటి లక్షణాలు లేవు. వీరందరినీ ఇతర జట్ల నుంచి వేరుచేసి ఐసోలేషన్‌లో ఉంచాం' అని బీసీసీఐ తెలిపింది. వీరంతా ఐపీఎల్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారని వివరించింది.

టీమ్ పేరును వెల్లడించని బీసీసీఐ:
ఐపీఎల్ 2020 హెల్త్ అండ్ సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం.. ఐపీల్-2020 సీజన్ పూర్తయ్యేంత వరకూ పార్టిసిపెంట్లకు నిరంతర పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. అయితే కరోనా సోకిన ఆటగాళ్లు, సిబ్బంది లేదా వారు ఏ జట్టుకు చెందినవారు అనే విషయాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. 12 మంది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇంతకు ముందు వార్తలు వచ్చినప్పటికీ.. టీమ్ పేరు మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.

సీఎస్‌కేకు చెందినవారే?:
కరోనా వైరస్ బారినపడిన వారంతా చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందినవారేనని సమాచారం తెలుస్తున్నది. సీఎస్‌కే పేసర్ దీపక్ చాహర్, యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్‌కు వైరస్ సోకినట్లు సమాచారం. సీఎస్‌కే నిర్వాహక బృందంలోని సీనియర్ అధికారి, ఆయన భార్యకు.. సోషల్ మీడియా బృందంలో కొందరికి వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి.

ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి:
ఐపీఎల్ టీ20 టోర్నమెంట్ 13వ అడిషన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యూఏఈలో జరుగనుంది. ఫైనల్ మ్యాచ్ మంగళవారం (నవంబర్ 10) జరుగుతుంది. వారాంతంలో కాకుండా.. ఒక మామూలు రోజులో ఫైనల్ మ్యాచ్ జరుగనుండటం టోర్నమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంతకుముందు మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా బీబీసీఐ వాయిదా వేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఇదే తొలిసారి.. వర్చువల్‌గా క్రీడా పురస్కారాలు అందజేత!!