Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: కోహ్లీ, రోహిత్ మార్క్ స్కెచ్.. పొలార్డ్ గోల్డెన్ డక్!

Virat kohli and Rohit Sharma’s Master Plan With Chahal To Dismiss Kieron Pollard

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న చారిత్రాత్మక వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు. సూపర్బ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను హడలెత్తిస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ ఆటగాళ్లంతా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఇక ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఔటైన విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌తోనే పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ‌.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటున్నాడు.

ఈ ఇద్దరూ కలిసి ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రోహిత్.. విరాట్ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కీరన్ పొలార్డ్ వికెట్ కోసం రోహిత్, కోహ్లీ చాహల్‌తో కలిసి మార్క్ స్కెచ్ వేసారు. చాహల్ వేసిన 20వ ఓవర్‌లో నికోలస్ పూరన్(18) ఎల్బీగా వెనుదిరగ్గా.. పొలార్డ్ క్రీజులోకి వచ్చాడు. ఇక పొలార్డ్ రాకను గమనించిన కోహ్లీ.. రోహిత్ దగ్గరకు వెళ్లి సూపర్ ప్లాన్ చెప్పాడు. దానికి సై అన్న కెప్టెన్.. చాహల్‌కు వివరించి బిగ్ వికెట్ సాధించాడు.

పొలార్డ్ బ్యాటింగ్‌కు అనుగుణంగా అప్పటికప్పుడూ ఫీల్డ్ సెటప్ మార్చి.. గూగ్లీ బంతితో విండీస్ సారథిని బోల్తా కొట్టించారు. చాహల్ గూగ్లీని ఏ మాత్రం అంచనా వేయలేకపోయిన పొలార్డ్.. డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత ఆటగాళ్లంతా తెగ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా అభినందించడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రోహితే కాదు కీపర్ రిషభ్ పంత్ సైతం విరాట్ ప్లాన్‌ను మెచ్చుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మహమ్మద్ సిరాజ్ తన సెకండ్ ఓవర్‌లోనే విండీస్ ఓపెనర్ షై హోప్(8)ను క్లీన్ బౌల్డ్ చేసి శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(13), డారెన్ బ్రావో(18)లను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి సుంధర్ దెబ్బతీసాడు. ఆ తర్వాత చాహల్‌కు రంగంలోకి దింపిన రోహిత్ ఫలితాన్ని రాబట్టాడు. ఒకే ఓవర్‌లో పూరన్, పొలార్డ్‌ రూపంలో రెండు వికెట్లు తీసిన చాహల్.. మరుసటి ఓవర్‌లో షమరా బ్రూక్స్‌(10)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అకీల్ హోస్సెన్(0)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేశాడు. అయితే రోహిత్ శర్మ మూడు రివ్యూల ద్వారా ఫలితం సాధించడం విశేషం. క్రీజులో జాసన్ హోల్డర్(21 బ్యాటింగ్), ఫాబియన్ అలెన్ (19 నాటౌట్) పోరాడుతున్నారు. 30 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 7 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది.

Story first published: Sunday, February 6, 2022, 16:19 [IST]
Other articles published on Feb 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+