Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG వన్డే సిరీస్.. బరిలో కోహ్లీ, రోహిత్! ఎలా చూడాలంటే?

ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నదమవుతుంది. టీమిండియా ఐకాన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సిరీస్‌ ఆడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా పేలవ ప్రదర్శనతో టీ20 సిరీస్‌ ఏకపక్షంగా సాగగా.. వన్డే సిరీస్‌ అలా ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు. అనుభవం కలిగిన కోహ్లీ, రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతుండటంతో టీమిండియా‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు కత్తిమీద సామేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ కొంపముంచిన ఐపీఎల్!

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ కొంపముంచిన ఐపీఎల్!

ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. నామమాత్రము ఆఖరి టీ20 శనివారం జరగనుండగా.. మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే జరగనుండగా.. జూలై 16న కార్డీప్ వేదికగా రెండో వన్డే జరగనుంది. జూలై 19(ఆదివారం)న ఐకానిక్ క్రికెట్ స్టేడియం లార్డ్స్ వేదికగా ఆఖరి మ్యాచ్ జరగనుంది.

Virat Kohli and Rohit Sharma Return How To Watch India vs England ODI Series Schedule Timings and Squads

కోహ్లీ, రోహిత్‌పైనే ఆశలు..

ఐపీఎల్ 2026 విజయానంతరం తొడ కండరాల గాయంతో ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ తర్వాత అఫ్గాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ మాత్రం ఈ సిరీస్ ఆడాడు. స్వింగ్ కండిషన్స్‌లో యంగ్ ఇండియా తడబడటంతో సీనియర్లు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

భారత్ X ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్..

జూలై 14(మంగళవారం): తొలి వన్డే, బర్మింగ్‌హామ్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం

జూలై 16(గురువారం): రెండో వన్డే, కార్డీప్, సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం

జూలై 19(ఆదివారం): మూడో వన్డే, లార్డ్స్, సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభం

ఎలా చూడాలంటే..?

ఈ సిరీస్‌కు కూడా సోనీ నెట్ వర్క్, జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. టీవీలో సోనీ నెట్ వర్క్‌కు చెందిన ఛానెల్స్‌లో నచ్చిన భాషలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్‌ను ఎంచుకోవాలి. జియో హాట్‌స్టార్‌లో కూడా నచ్చిన భాషలో మ్యాచ్‌లను చూడవచ్చు. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే రుసుము చెల్లించుకోవాల్సిందే. ప్రత్యేక రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అయితే పొందవచ్చు.

ఇంగ్లండ్ పర్యటనకు భారత వన్డే టీమ్:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే, గుర్నూర్ బ్రార్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్.

IND vs ENG: తిలక్, ఇషాన్‌పై వేటు.. సంజూకు చోటు! ఆఖరి టీ20కి భారత జట్టు ఇదే!

IND vs ENG: తిలక్, ఇషాన్‌పై వేటు.. సంజూకు చోటు! ఆఖరి టీ20కి భారత జట్టు ఇదే!

ఇంగ్లండ్ టీమ్:

హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకోబ్ బెతెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరణ్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, జోరూట్, జోష్ టంగ్.

Story first published: Friday, July 10, 2026, 16:37 [IST]
Other articles published on Jul 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+