ఐసీసీ దశాబ్దపు క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ.. వన్డేల్లో ధోనీ, రోహిత్

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు నామినేషన్స్‌లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ కేటగిరిలో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీతో పాటు భారత్‌కే చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ ప్లేయర్ జోరూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు.
మహిళల కేటగిరిలో మిథాలీ రాజ్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు బరిలో నిలిచింది. ఈ అవార్డుల కోసం 2010-19 పదేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను నామినేట్ చేసింది. నామినేట్ అయిన ఆటగాళ్లలో అభిమానుల ఓట్ల గెలుచుకున్న ఆటగాళ్లను విజేతలుగా ఎంపిక చేస్తారు. ఐసీసీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి ఫ్యాన్స్ తమకు నచ్చిన ఆటగాళ్లకు ఓట్ చేయవచ్చు. ఐసీసీ నామినేషన్స్‌లో విరాట్ కోహ్లీ అన్ని కేటగిరిల్లో ఎంపికయ్యాడు.

నామినేట్ అయిన భారత ఆటగాళ్లు
ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్
వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి
టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: విరాట్ కోహ్లీ
టీ20 ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ

పూర్తి నామినేషన్ల జాబితా..
ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: విరాట్ కోహ్లీ, జోరూట్, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్, అశ్విన్, కుమార సంగక్కర
మహిళల ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: ఎల్లిస్ పెర్రీ(ఆస్ట్రేలియా), మెగ్ లాన్నింగ్(ఆస్ట్రేలియా), సుజీ బేట్స్(న్యూజిలాండ్), టేలర్(విండీస్), మిథాలీ రాజ్(భారత్), సారా టేలర్(ఇంగ్లండ్)
పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: విరాట్ కోహ్లీ, లసిత్ మలింగా, మిచెల్ స్టార్క్, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, కుమార సంగక్కర
మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: ఎల్లిస్ పెర్రీ(ఆస్ట్రేలియా), మెగ్ లాన్నింగ్(ఆస్ట్రేలియా), సుజీ బేట్స్(న్యూజిలాండ్), టేలర్(విండీస్), మిథాలీ రాజ్(భారత్), జులాన్ గోస్వామి(భారత్),
పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: విరాట్ కోహ్లీ, జోరూట్, స్టీవ్ స్మిత్, జేమ్స్ అండర్సన్, కేన్ విలియమ్సన్, రంగనా హెరాత్, యాసిర్ షా

టీ20 ఫార్మాట్ జాబితా..
పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ద డికేడ్: రషీద్ ఖాన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, ఆరోన్ ఫించ్, లసిత్ మలింగా, క్రిస్ గేల్
ఐసీసీ మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: మెన్ లాన్నింగ్, సోఫియా డివైన్, ఎల్లిస్ పెర్రీ, దియానంద్ర డాటిన్, అలిస్సా హీలీ, అన్య శ్రుబ్‌సోల్
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డ్: ఎంఎస్ ధోనీ, డానియల్ వెటోరీ, కేన్ విలియమ్సన్, మిస్బా ఉల్ హక్, క్యాథెరిన్ బ్రంట్, బ్రెండన్ మెక్‌కల్లమ్, అన్య, మహేళ జయవర్దనే, విరాట్ కోహ్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications