ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్: కోహ్లీ-అనుష్క కలిసి తరచూ వెళ్లే దేశం ఏదో తెలుసా?

హైదరాబాద్: క్రికెట్ నుంచి కొద్దిపాటి విరామం లభించనప్పుడు భారత క్రికెటర్లు అప్పుడప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటోను తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
అయితే, ఈ ఫోటోని విరుష్క జోడీ ఎక్కడ దిగిందో తెలియనప్పటికీ ఎన్నో లైకులు, కామెంట్లు సంపాదించుకుంది. నవంబర్ 3 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు సైతం విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు.
దీంతో తనకు లభించిన కొద్దిపాటి విరామాన్ని కోహ్లీ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా.. కోహ్లీనే కాదు రోహిత్ శర్మ, ధోనిలు సైతం తమకు లభించిన విరామాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడమో లేక ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్స్‌కు వెళ్తుంటారు.
ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్స్‌ను ఒక్కసారి పరిశీలిద్దాం.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలకు గతేడాదే వివాహం జరిగింది. కోహ్లీకి విరామం లభించినప్పుడల్లా వీరిద్దరూ కలిసి అనేక దేశాలను చుట్టి వస్తుంటారు. విరుష్క జోడీ ఎక్కువగా సందర్శించే దేశాల్లో బార్సిలోనా ఒకటి. అక్కడి ప్రకృతి మనసుని ఆహ్లాదపరుస్తుంది. దీంతో పాటు సాగ్రడా ఫ్యామిలియా చర్చి, ఖరీదైన ఖండాంతర రెస్టారెంట్లకు వెళుతుంటారు. బార్సిలోనాతో పాటు స్విట్జర్లాండ్, ఫిన్‌లాండ్‌లను విరుష్క జోడీ తరుచూ సందర్శిస్తుంది.

రోహత్ శర్మ
టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. టెస్టు ఓపెనర్‌గా విజయవంతం కావడంతో పాటు తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని కూడా నమోదు చేశాడు. వన్డేల్లో అయితే రోహిత్ శర్మ ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తన భార్య రితికా సాదేష్‌తో కలిసి తరుచూ యుఏఈ, యూరోపియన్ దేశాలకు వెళ్తుంటాడు. ఇటలీ రోహిత్‌కు ఇష్టమైన ప్రదేశం. గతంలో అనేక సార్లు కుటుంబంతో కలిసి బేస్‌బాల్ ఎన్ఎఫ్ఎల్, ఎన్‌బీఏ గేమ్స్‌కు కూడా హాజరయ్యాడు,
ICC T20 World Cup: చరిత్ర సృష్టించిన పపువా న్యూ గునియా

సచిన్ టెండూల్కర్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు బీచ్‌లంటే తెగఇష్టం. కుటుంబంతో కలిసి సచిన్ ఎక్కువగా గోవా బీచ్‌లను సందర్శిస్తుంటాడు. ఈ బ్యాటింగ్ దిగ్గజానికి ఇంగ్లాండ్ కూడా ఓ పేవరేట్ స్పాట్. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు స్వతహాగా పెద్ద అభిమాని అయిన సచిన్ టెండూల్కర్ వింబుల్డన్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను తరచూ ఇంగ్లాండ్‌కు వెళుతుంటాడు.

మహేంద్ర సింగ్ ధోని
ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ధోని క్రికెట్‌కు రెండు నెలలు పాటు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ధోనికి కూడా బీచ్‌లంటే ఎక్కువ ఇష్టం. భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి తరచూ శ్రీలంకలోనీ బీచ్‌లను ధోని సందర్శిస్తుంటాడు. ధోని ఫేవరేట్ డెస్టినేషన్స్‌లో యుఎస్ఏ కూడా ఒకటి. దుబాయిలో ధోని క్రికెట్ అకాడమీని కూడా నెలకొల్పాడు. ఇటీవలే ధోని అమెరికాలో గోల్ఫ్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications