
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు దుబాయి వేదికగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆదివారం పపువా న్యూ గునియా-కెన్యా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గునియా 118 పరుగులకే కుప్పకూలింది.
తొలుత 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ నార్మన్(48 బంతుల్లో 54 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కెన్యాను పపువా న్యూ గునియా బౌలర్లు 73 పరుగులకే ఆలౌట్ చేశారు. గునియా బౌలర్లలో పోకనా(3-21), అసద్ వాలా(3-7) చెరో మూడు వికెట్లతో చెలరేగారు.
అయితే, ఈ మ్యాచ్ గెలిచినా పపువా న్యూ గునియా వరల్డ్‌కప్‌కు తొలుత అర్హత సాధించలేదు. ఫలితం మరో మ్యాచ్‌పై ఆధారపడటమే అందుకు కారణం. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 12.3 ఓవర్లలో నిర్ణీత లక్ష్యం చేరుకోకపోవడంతో నెట్ రన్‌రేట్ ఆధారంగా పపువా న్యూ గునియా అర్హత సాధించింది. మరోవైపు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్ ఏ నుంచి నేరుగా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది.
కాగా, పపువా న్యూ గునియా(పీఎన్‌జీ) ఆదివారం అర్హత సాధించగా శనివారం ఐర్లాండ్ జట్టు టీ20 వరల్డ్‌కప్‌కు శనివారం అర్హత సాధించింది. శనివారం ఐర్లాండ్ జట్టు కూడా నైజీరియాపై ఎనిమిది వికెట్లతో గెలుపొందింది. అయితే, ఒమన్-జెర్సీ జట్ల మ్యాచ్‌పై దాని భవితవ్యం ఆధారపడింది. జెర్సీతో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ గెలిచి ఉంటే ఐర్లాండ్ అర్హత సాధించి ఉండేది కాదు. జెర్సీ జట్టు 14 పరుగులతో ఒమన్‌ను ఓడించడంతో ఐర్లాండ్ నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.
2020లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియాతో పాటు మరో 9 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇందులో టాప్-8 జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించగా, మరో రెండు జట్లు మాత్రం ఆరు ఇతర జట్లతో గ్రూప్ స్టేజ్‌లో తలపడి ఈ రౌండ్‌కు అర్హత సాధించాల్సి ఉంది.
ఈ ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీ జరుగుతుంది. ఇందులో నాలుగు జట్లు సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. టాప్-10జట్లలో పాకిస్థాన్, ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం గ్రూప్ స్టేజ్‌లో మరో ఆరు జట్లతో తలపడాల్సి ఉంటుంది.