Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక మేం ముంబై ఇండియన్స్‌ అభిమానులం.. మా మద్దతు రోహిత్ సేనకే: కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్

Virat Kohli And Faf Du Plessis Supporting For Mumbai Indians After Winning On GT

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ అవకాశాలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కేజీఎఫ్(కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) చెలరేగారు. అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ముంబై ఇండియన్స్‌పై ఆధారపడి ఉంది. 8 విజయాలు 16 పాయింట్లతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ జట్టు నెట్‌రన్‌రేట్‌ (-0.253) తక్కువగా ఉంది.

ముంబై చేతిలో భవితవ్యం..

దాంతో ఏడు విజయాలతో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే మెరుగైన రన్‌రేట్ (0.255) ఉన్న కారణంగా ఆర్‌సీబీ వెనక్కినెట్టి ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ముంబై గెలిస్తే మాత్రం ఆర్‌సీబీకి అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్‌సీబీ అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్‌లే స్వయంగా వెల్లడించారు. తాము ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానులుగా మారిపోయామని, రోహిత్ సేనకే తమ మద్దతని ప్రకటించారు.

రోహిత్ సేనకే మా మద్దుతు..

గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్, ఫాఫ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్పోర్ట్స్‌తో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇప్పుడు ముంబై గెలవాలని, అందుకోసం తాము ఇద్దరం మద్దతు తెలియజేస్తామని చెప్పాడు. ఆ వెంటనే తాము ఇద్దరమే కాకుండా తమ జట్టులోని 25 మంది మద్దతు కూడా ముంబై ఇండియన్స్‌కే ఉంటుందన్నాడు. వీలైతే తమని ముంబై, ఢిల్లీ మ్యాచ్‌లో రోహిత్ సేన అభిమానులుగా చూడొచ్చని కూడా చెప్పాడు. ఆ వెంటనే ఫాఫ్ డుప్లెసిస్.. ముంబై, ముంబై అంటూ అరిచాడు. ఈ వీడియోను టోర్నీ నిర్వాహకులు అభిమానులతో పంచుకోగా వైరల్ అయింది.

ముంబై ఇండియన్స్ కుట్ర..

ఈ పరిస్థితిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆర్‌సీబీ మద్దతు ఇచ్చినా.. ముంబై గెలిచినా ఓడినా ఆ జట్టుకు ఒరిగేదేం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక చివరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తామని ముంబై సారథి రోహిత్ శర్మ చెప్పిన నేపథ్యంలో.. ఆర్‌సీబీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరకుండా ముంబై కుట్రపన్నుతుందని కామెంట్ చేస్తున్నారు. కావాలనే ఓడిపోవాలని చూస్తుందని, ఇది ఏమాత్రం భావ్యం కాదంటున్నారు. మరికొందరు మాత్రం.. ఆర్‌సీబీకి లక్ ఫేవర్ చేస్తుందని, గుజరాత్ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందంటున్నారు. ఇదే జోరు కొనసాగించి టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, April 22, 2023, 20:04 [IST]
Other articles published on Apr 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+