ఆస్ట్రేలియాతో డే/నైట్ మ్యాచ్.. గెలుపు గులాబీ బాట కాదు.. కోహ్లీ సేనను కలవరపెడుతున్న విషయాలు!

హైదరాబాద్: మొదట్లో డే/నైట్ మ్యాచ్‌లకు ససేమిరా అన్న భారత జట్టు.. గత ఆస్ట్రేలియా పర్యటనలోనూ గులాబీ బంతి మ్యాచ్‌ను మరోమాటకు తావు లేకుండా తిరస్కరించిది. అప్పటికే ఆస్ట్రేలియాకు నాలుగు 'పింక్ బాల్' టెస్టులు ఆడిన అనుభవం ఉండగా... భారత్ ఒక్క 'పింక్' మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో తమ సిరీస్ గెలుపు అవకాశాలు దెబ్బ తింటాయని భారత బోర్డు భావించింది. కానీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ రాకతో పరిస్థితులు మారాయి. గతేడాది తొలిసారిగా ఈడెన్ మైదానం వేదికగా కోహ్లీ సేన బంగ్లాదేశ్‌తో డేనైట్ మ్యాచ్‌లను షురూ చేసింది.
ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై తొలి డేనైట్ సమరానికి సిద్దమైంది. ఓవరాల్‌గా ఆసీస్ జట్టు 7 డే-నైట్ టెస్టులు స్వదేశంలోనే ఆడి అన్నీ గెలవగా... భారత్ తమ ఒకే ఒక మ్యాచ్‌ను సొంతగడ్డపై బలహీనమైన బంగ్లాదేశ్‌తో ఆడి గెలుపొందింది. అయితే బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై సులువుగా గెలిచిన ఆసీస్‌ను అలా ఓడించడం అంత ఈజీ కాదు. తొలి గులాబి టెస్టులో భారత జట్టుకు ఎదురు కానున్న సవాళ్లపై ఓ లుక్కెద్దాం!

డే/నైట్ బంతి మారింది..
భారత జట్టు బంగ్లాతో తమ పింక్ బాల్ టెస్టును ‘ఎస్‌జీ'బంతితో ఆడింది. కానీ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘కూకాబుర్రా' బంతిని వాడనున్నారు. అయితే గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు కూడా ఇదే తరహా బంతిని ఎదుర్కోవడం సానుకూలాంశం. సాధారణ ఎరుపు బంతితో పోలిస్తే కూకాబుర్రా గులాబీ బంతి సాయంత్రం కాగానే భిన్నంగా స్పందిస్తోంది. ఒక్కసారిగా బంతి వేగం పెరుగుతుంది. గాల్లో స్వింగ్ కావడంతో పాటు పిచ్‌పై పడిన తర్వాత కూడా ఈ తేడా కనిపిస్తోంది. తొలి టెస్టుకు అందుబాటులో లేని డేవిడ్ వార్నర్‌కు డే అండ్ నైట్ టెస్టుల్లో మంచి అనుభవం ఉంది. ‘ట్రిపుల్ సెంచరీ' సహా గులాబీ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన వార్నర్ చెప్పినట్లుగా.. పింక్ బాల్‌ను ఎదుర్కొనే విషయంలో కొంత సమయం ఇబ్బంది పడ్డా దానిని సానుకూలంగా కూడా మార్చుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. దానిని సరిగ్గా అంచనా వేయగలిగితే పరుగుల వరద పారుతుంది.

పేసర్లు ఓకే.. స్పిన్నర్లే..
ఆసీస్‌తో పోలిస్తే టీమిండిమా పేస్ బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. కానీ డే-నైట్ టెస్టుల అనుభవం విషయంలో ఆసీస్ బౌలింగ్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. 7 గులాబీ టెస్టులూ ఆడిన మిచెల్ స్టార్క్ 42 వికెట్లు తీస్తే 6 మ్యాచ్‌ల్లో హాజల్‌వుడ్ 28, ప్యాట్ కమిన్స్ 4 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ త్రయం భారత బ్యాట్స్‌మెన్ పని పట్టేందుకు సిద్ధంగా ఉంది.
అయితే అడిలైడ్‌లో పడిన మొత్తం వికెట్లలో పేస్ బౌలర్లే 101 తీయడం మన జట్టులో కూడా ఆశలు రేపుతోంది. కానీ స్పిన్ విభాగంలో మాత్రం ఆ్రస్టేలియా బౌలర్ నాథన్ లయన్ మినహా విదేశీ స్పిన్నర్లు ఎవ్వరూ కూడా ఇక్కడ రాణించలేదు. లయన్ ఒక్కడే 18 వికెట్లు తీయగా... ఇతర బౌలర్లెవరూ రెండు వికెట్లకు మించి తీయకపోవడం కలవరపెట్టే అంశం. కాబట్టి లయన్ నుంచి కూడా భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా తుది జట్టులో అశ్విన్, కుల్దీప్‌లలో ఎవరికి చోటిస్తుందో చెప్పలేం.

కలవరపెడుతున్న అనుభవలేమి..
రికార్డు చూస్తే పింక్ సమరంలో ఒక్క టెస్టులో మినహా ఆస్ట్రేలియా జట్టును ప్రత్యర్థి ఇబ్బంది పెట్టలేకపోయింది. ఆసీస్ రెండు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, ఒక మ్యాచ్‌లో 296 పరుగులతో నెగ్గారు. ఏ విదేశీ జట్టు బ్యాటింగ్ సగటు కూడా ఒక్కో వికెట్‌కు 30 పరుగులకు మించి లేదు. ఒకసారి సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం మినహా 13 ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యాయి.
మొత్తంగా చూస్తే గులాబీ బంతితో డే-నైట్ టెస్టులు ఆడటంలో అనుభవలేమినే ఈ జట్లలో కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అదే కలవరపెడుతుంది. ఇలాంటి స్థితిలోనే పట్టుదల కనబర్చి సిరీస్‌లో శుభారంభం చేయాల్సి ఉంది.

ఆ సమయమే కీలకం!
పింక్ టెస్టులో సూర్యాస్తమయ సమయం కీలకం కానుంది. రెండో సెషన్ చివర్లో కొద్దిసేపు, మూడో సెషన్ ఆరంభంలో మరికొంత సేపు ఉండే ఈ సమయంలోనే బ్యాట్స్‌మన్ ఏకాగ్రత చెదరడం, ప్రత్యర్థి జట్టు వికెట్ల వేటలో పడటం కనిపిస్తున్నాయి. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా సరిగ్గా ఇదే మాట చెప్పాడు. ‘ఆ 40-50 నిమిషాల సమయంలోనే ఎంతో ఓపిక అవసరం. అప్పుడు బాగా ఆడగలిగితే ఆ తర్వాత తిరుగుండదు. కాబట్టి కొత్త ఆటగాడు వచ్చి ఇబ్బంది పడటంకంటే అప్పటికే క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పట్టుదల కనబరిస్తే మంచిది' అని రహానే అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications