సరదాగా గొడవ
సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో నూతనోత్తేజాన్ని నింపింది. ఈ గెలుపును విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఆడుతూ.. పాడుతూ ఆహ్లాదంగా గడిపారు. బెంగళూరు ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయి ఈత కొలనులో వాలీబాల్ ఆడారు. ఈ సమయంలో ఆటగాళ్లు సరదాగా గొడవ పడ్డారు. ఇలా గొడవ పడుతూ ఖాళీ సమయం ఆస్వాదించారు.

కోహ్లీ ఆట పాటలు
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహాయ సిబ్బంది 1970ల్లోని పాటలు పాడి అలరించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ నవదీప్ సైనీ, ఆల్‌రౌండర్ శివమ్ దూబె, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ హిందీ పాటలు ఆలపించారు. ఈ క్రమంలో విరాట్ ఓ రెండు స్టెప్పులూ వేశాడు. ఇక మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తనకు నచ్చిన ఓ ఆంగ్ల గీతాన్ని అందరికి వినిపించాడు. ఆటగాళ్లు గెలుపును ఎంజాయ్ చేస్తుండగా తీసిన వీడియోను ఫ్రాంచైజీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

అనుష్క శర్మ కూడా
ఉత్కంఠ విజయంతో బెంగళూరు అభిమానులు కూడా ఆనందంలో తెలియాడుతున్నారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనుష్క ఓ పోస్టు చేశారు. 'ఓ గర్భిణి.. మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇంతకన్నా థ్రిల్లింగ్ ఏముంటుంది' అని పేర్కొన్నారు. ఇన్‌స్టా స్టోరీలో విక్టరీ మూమెంట్ ఫోటోలతో పాటు బెంగుళూరు సభ్యుల ఫోటోలను కూడా ఆమె పోస్టు చేశారు. బెంగళూరు జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ మూడో తేదీన అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

కోహ్లీ విఫలం.. అభిమానులు నిరాశ
అయితే ఐపీఎల్ 2020 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ విఫలం కావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కోహ్లీ గాడిలో పడాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 18 పరుగులే చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 11 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. డిఫెన్సె చేయడానికే తీవ్రంగా ఇబ్బంది పడిన కోహ్లీ.. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


Click it and Unblock the Notifications

IPL 2020లో సన్‌రైజర్స్ బోణీ.. సెహ్వాగ్ ఫన్నీ ట్వీట్!!