For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండేళ్ల చిన్నారిని కాపాడిన కోహ్లీ- అనుష్క.. రూ.16 కోట్ల ఖరీదైన మెడిసిన్‌కు సాయం!

Virat Kohli and Anushka Sharma save a kid’s life by raising funds for Rs.16 cr expensive drug
Virat Kohli Save A Kid’s Life, అతనొక్కడే కాదు | World’s Expensive Medicine || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే కరోనా బాధితుల కోసం రూ. 2 కోట్ల విరాళం ప్రకటించడంతో పాటు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టి అవసరమైన నిధులను సేకరించిన విరుష్క.. తాజాగా ఓ రెండున్నరేళ్ల చిన్నారిని కాపాడారు. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి నుంచి రక్షించేందుకు అతనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్గెన్స్‌మా అనే మెడిసన్ అవసరమైంది.

రూ. 16 కోట్ల మెడిసిన్..

దాని ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఈ డబ్బుల కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు ట్విటర్ వేదికగా 'AyaanshFightsSMA'పేరుతో ఫండ్ రైజింగ్ క్యాంపైన్ చేపట్టారు. అయితే సోమవారంతో తన కుమారుడి మెడిసిన్‌కు కావాల్సిన రూ.16 కోట్లు వచ్చాయని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు విరాళాలు అందించిన వారితో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ధన్యవాదాలు తెలిపారు. 'మా ఈ #Saveayaanshgupta ఫండ్ రైజింగ్ క్యాంపైన్ ఇంత త్వరగా ముగుస్తుందనుకోలేదు. జోల్గెన్స్‌మా మెడిసిన్‌కు కావాల్సిన రూ.16 కోట్లు వచ్చాయి. అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు'అని ట్వీట్ చేశారు.

సిక్స్‌తో గెలిపించారు..

సిక్స్‌తో గెలిపించారు..

మరో ట్వీట్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. మీ అభిమానులుగా మేం ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాం. కానీ మీరు అయాన్ష్ కోసం మేం ఊహించనిదాని కంటే ఎక్కువ చేశారు. మీ ఔదార్యానికి ధన్యవాదాలు. మా జీవితంలోనే ఈ కఠినమైన మ్యాచ్‌ను సిక్స్‌తో గెలవడానికి మీరు సాయం చేశారు. మీ సాయానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.'అని పేర్కొన్నారు. అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎంత సాయం చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ భారీ మొత్తంలోనే సాయం చేసినట్లు చిన్నారి తల్లిదండ్రుల ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది.

ఇంగ్లండ్ టూర్‌ కోసం..

ఇంగ్లండ్ టూర్‌ కోసం..

ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్నాడు. ఈ పర్యటనలో భారత్ న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా ముంబైలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ పాటిస్తున్నారు. విరాట్ కోహ్లీతో అనుష్క కూడా ఇంగ్లండ్ వెళ్లనుంది. కూతురికి జన్మనిచ్చిన తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన అనుష్క.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. జూన్-2న భారత జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరనుండగా.. జూన్ 18 నుంచి 22 వరకు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది.

Story first published: Monday, May 24, 2021, 19:48 [IST]
Other articles published on May 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+