Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరుష్క నెట్‌వర్త్ ఎంతో తెలుసా? దేశంలోనే రిచెస్ట్ సెలెబ్రిటీ జోడీ!

Virat Kohli and Anushka Sharmas Combined Net worth is nearly 1200 Crore

న్యూఢిల్లీ: క్రికెట్ మైదానంలో పరుగుల రారాజుగా ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సంపాదనలో కూడా అదరగొడుతున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లీ జనవరిలో తండ్రి కాబోతున్నాడు. ఈ ఇద్దరూ తమ తమ రంగాల్లో రాణిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. వరల్డ్ క్లాస్ క్రికెటర్‌గా కోహ్లీ.. ఎంటర్‌టైన్‌మెంట్ క్వీన్‌గా అనుష్క శర్మ దేశ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి నెట్‌వర్త్ సుమారు రూ. 1200 కోట్లకు చేరిందని, దేశంలో రిచెస్ట్ అత్యంత సంపన్నమైన సెలెబ్రిటీ జోడీగా నిలిచిందని వ్యాపార వర్గాలు పేర్కొనడం చర్చనీయాంశమైంది.

షాంపూ అడ్వర్టైజ్‌మెంట్ కోసం..

షాంపూ అడ్వర్టైజ్‌మెంట్ కోసం..

2013లో షాంపూ అడ్వర్టైజ్‌మెంట్ కోసం తొలిసారి కలుసుకున్న అనుష్క, విరాట్ ఆ తర్వాత నాలుగేళ్లు ప్రేమలో మునిగి 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహమైనా అనుష్క తన కెరీర్‌ను కొనసాగించింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ సంతోషంగా గడిపారు. తమ జీవితంలో మధురమైన క్షణాలను

గడిపేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం గర్భవతి అయిన అనుష్క.. జనవరిలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. సతీమణితో ఈ ఆనంద క్షణాలను ఆస్వాదించేందుకు ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న విరాట్ పెటర్నిటీ లీవ్ మీద భారత్‌కు రానున్నాడు. అయితే ఈ ఇద్దరి సంపాదనలో ప్రధాన భాగం అడ్వర్టైజ్‌మెంట్స్ ఒప్పందం ద్వారా వచ్చేవే.

కోహ్లీ నెట్ వర్త్ రూ.1000 కోట్లు!

కోహ్లీ నెట్ వర్త్ రూ.1000 కోట్లు!

2019 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, విరాట్ కోహ్లీ నెట్‌వర్త్ సుమారు రూ. 252.72 కోట్లు. టాప్-100 సెలెబ్రెటీస్‌లో ఒకడు. అయితే ఇతర నివేదికలు మాత్రం విరాట్ నికర విలువ సుమారు రూ.900 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నాయి. విరాట్ కోహ్లీ సంపాదనలో ప్రధాన భాగం తన సొంత వ్యాపార పెట్టుబడులు, ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పందాల నుంచే వస్తోంది. క్రికెట్‌పరంగా.. బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్లు ఆర్జిస్తున్న విరాట్.. ఐపీఎల్‌లో ఆర్సీబీ నుంచి 18 కోట్లు తీసుకుంటున్నాడు. అతనికి రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి.

అనుష్కా సంపాదన 350 కోట్లు..

అనుష్కా సంపాదన 350 కోట్లు..

ఇక ఫోర్బ్స్ లెక్కల ప్రకారం గతేడాది అనుష్కా నెట్‌వర్త్ రూ.28.67 కోట్లు.. కాగా.. 2018లో 45.83 కోట్లు. ఇక ఓవరాల్‌గా ఆమె నికర ఆదాయం రూ.350 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే 2018 నుంచి ఆమె ఎలాంటి సినీ ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం ఆదాయం తగ్గింది. కానీ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఇక విరుష్కకు ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. గూర్గాన్‌లో రూ. 80 కోట్ల విలువ చేసే ఆస్థులున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.

Story first published: Friday, December 4, 2020, 13:43 [IST]
Other articles published on Dec 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+