
ముంబై: లగ్జరీ లైఫ్ గడిపే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ సాధారాణ వ్యక్తుల్లా అవతారమెత్తారు. ఓ దిగువ మధ్యతరగతి కుటుంబలా స్కూటీపై ముంబై వీధుల్లో షికారుకు వెళ్లారు. ఎప్పడూ లగ్జరీ కారుల్లో ప్రయాణించే ఈ జంట.. స్కూటీపై చక్కర్లుకొట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు. విరుష్క జంట స్కూటీపై రైడ్ వెళ్లిన ఫొటోలు శనివారం నెట్టింట వైరల్‌గా మారాయి. కోహ్లీ స్కూటీని నడుపుతుండగా వెనుక అనుష్క కూర్చోని ఉంది.
అయితే వీరిద్దరూ హెల్మెట్‌లు ధరించినప్పటికీ తమ ఆరాధ్య క్రికెటర్‌ను అభిమానులు గుర్తుపట్టేశారు. ఈ క్రమంలో కోహ్లీ, అనుష్క స్కూటర్‌పై వెళ్తుండగా అభిమానులు వీడియోలను తమ ఫోన్‌లలో చిత్రీకరించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఇంగ్లండ్ పర్యటన తర్వాత కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన విరాట్.. భారత్‌కు తిరిగొచ్చాక కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. సొంత మైదానంలో ఫామ్‌లోకి వచ్చేందుకు చమటోడుస్తున్నాడు. ఆసియాకప్‌తో మళ్లీ మైదానంలోకి రానున్నాడు. ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరనగుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది.
కోహ్లీ బ్యాటింగ్‌పై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. 2019 నవంబరు తర్వాత నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని విరాట్.. అర్ధసెంచరీలకు కూడా కష్టపడాల్సి వస్తోంది. దీంతో అతడు విరామం తీసుకోవాలంటూ పలువురు విదేశీ దిగ్గజాలు ఇటీవల సూచనలు కూడా చేశారు.