Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీని అవమానించిన ఆసీస్ ఫ్యాన్స్.. దమ్కీ ఇచ్చిన కింగ్!(వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా అభిమానులు దారుణంగా అవమానించారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. మరోసారి తన బలహీనతనే బయటపెడుతూ పెవిలియన్ చేరాడు.

ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌కే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన కోహ్లీ.. యశస్వి జైస్వాల్‌తో కలిసి మూడో వికెట్‌కు 102 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తాను ఎదుర్కొన్న 86 బంతుల్లో.. 85 బాల్స్ వరకు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను కోహ్లీ టచ్ చేయలేదు.

Virat Kohli altercation with Australian fans mocking him after dismissal in IND vs AUS 4th Test

చాలా ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. యశస్వి జైస్వాల్ రనౌట్‌‌గా వెనుదిరిగిన వెంటనే సహనం కోల్పోయి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌‌లో అతను ఆడిన తొలి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ఇదే. కానీ అదే అతనికి చివరి బంతి అయ్యింది. ఔటైన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వెళ్తున్న కోహ్లీని ఆసీస్ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు.

సూటి పోటి మాటలతో రెచ్చగొట్టారు. ఆసీస్ ఫ్యాన్స్ కామెంట్స్‌తో తీవ్ర ఆగ్రహానికి గురైన కోహ్లీ.. వెనక్కి వచ్చి వారిపై మండిపడ్డాడు.సెక్యూరిటీ సిబ్బంది వచ్చి కోహ్లీకి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్‌తో విరాట్ కోహ్లీ గొడవపడిన విషయం తెలిసిందే.

అతని భుజాన్ని బలంగా ఢీకొట్టి వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమవ్వగా.. మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించాడు. ఈ ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ఆసీస్ ఫ్యాన్స్‌తో పాటు ఆ దేశ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోహ్లీ ఓ జోకర్ అనే కథనాలను ప్రచురించింది. మరోవైపు ఫ్యాన్స్ మైదానంలో కోహ్లీని ఎగతాళి చేశారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకం చేజార్చుకోగా.. విరాట్ కోహ్లీ(86 బంతుల్లో 4 ఫోర్లతో 36) మరోసారి నిరాశపరిచాడు. క్రీజులో రిషభ్ పంత్‌(6 బ్యాటింగ్)తో పాటు రవీంద్ర జడేజా(4) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీసారు.

అంతకుముందు 311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140) భారీ శతకంతో చెలరేగగాడు.

Story first published: Friday, December 27, 2024, 14:42 [IST]
Other articles published on Dec 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+