హే హార్దిక్.. నువ్ పుష్ అప్స్ మాత్రమే చేశావ్.. నేను క్లాప్స్ కూడా జత చేస్తున్నా: కోహ్లీ

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్. శారీరక దృఢత్వంపై అతడికి ఎనలేని నమ్మకం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటలు కష్టపడతాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆటలోనే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ కోహ్లీనే ముందుండి టీమ్‌ని నడిపిస్తున్నాడు. అతడిని చూసి మిగతా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించారు. కోహ్లీని చూసి జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, మొహమ్మద్ షమీలు కూడా సిక్స్ పాక్ చేసారు.

గాల్లోకి ఎగురుతూ హార్దిక్ పుష్ అప్స్:
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలోనూ క్రికెటర్లు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఇంట్లోనే కష్టపడుతున్నారు. ఇటీవల టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జిమ్ చేసి కండలు పెంచాడు. హార్దిక్ గాల్లోకి ఎగురుతూ పుష్ అప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ పుష్ అప్స్ వీడియోని సోషల్ మీడియాలో హార్దిక్ పోస్ట్ చేయగా.. బాలీవుడ్ హీరోయిన్స్ సయామీ ఖేర్, కరిష్మా తనా ఫిదా అయ్యారు. ఇక హార్దిక్ తన సోదరుడు కృనాల్ పాండ్యాకు ఇలా చేయాలని సవాల్ చేశాడు.

సోదరుడికి ఛాలెంజ్.. కానీ..:
హార్దిక్ పాండ్యా చేసిన ఛాలెంజ్‌ని కృనాల్ పాండ్యా స్వీకరించపోయినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించాడు. హార్దిక్ తరహాలోనే పుష్ అప్స్ చేసిన కోహ్లీ.. వాటికి క్లాప్స్ కూడా జోడించాడు. ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకకముందే చప్పట్లు కొట్టాడు. అంతేకాదు అదే పుష్ అప్స్‌ని రివర్స్‌లో వెనక్కి వెళ్తూ కూడా చేయడం విశేషం. ఈ పుష్ అప్స్ విరాట్ ఫిట్‌నెస్ సామర్థ్యానికి అద్దం పడుతోంది. దీనికి సంబందించిన వీడియోను కోహ్లీ గురువారం పోస్టు చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది.

హే హార్దిక్.. నువ్ పుష్ అప్స్ చేశావ్:
'హే.. హార్దిక్ పాండ్య నువ్వు ఎగురుతూ చేసిన పుష్ అప్స్ చాలా నచ్చాయి. వాటికి నేను చప్పట్లను జత చేస్తున్నా' అని ఆ వీడియోకు విరాట్ కోహ్లీ కామెంట్ రాసుకొచ్చాడు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే కోహ్లీ లాక్‌డౌన్‌లోనూ తన కసరత్తులను ఇలా కొనసాగిస్తున్నాడు. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతోనూ వాటిని పంచుకుంటున్నాడు. అయితే గాల్లోకి ఎగురుతూ పుష్ అప్స్ తీసే క్రమంలో ఆటగాళ్లు గాయపడే ప్రమాదాలు ఉన్నాయి. సరైన పొజీషన్‌లో ల్యాండ్ అవలేకపోతే ప్రమాదం. అయినప్పటికీ కోహ్లీ, హార్దిక్ అవలీలగా వాటిని చేస్తుండటం ఇక్కడ విశేషం.

టీమిండియా ఫిట్‌నెస్ క్రెడిట్ అతడిదే:
భారత క్రికెట్ జట్టును ఫిట్‌నెస్ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత శంకర్ బసూదే. కోహ్లీ, బుమ్రా, పాండ్యా, జడేజా వంటి క్రికెటర్లను ఫిట్‌నెస్ పరంగా కూడా టాప్‌లో నిలిపిన వ్యక్తి శంకర్ బసూ. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్‌లో తన పోరాటాన్ని ముగించిన తర్వాత ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ బసూ తప్పుకున్నాడు. తన కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడంతో శంకర్ బసూ మళ్లీ అందుకు మొగ్గుచూపలేదు.
సరిగ్గా ఇదే రోజు.. గంగూలీ అరుదైన రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్!!
View this post on InstagramHey H @hardikpandya93 loved your fly push ups 💪😎. Here's adding a little clap to it 😉.
A post shared by Virat Kohli (@virat.kohli) on
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications