
ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 113) సెంచరీతో చెలరేగాడు. వన్డే ఫార్మాట్‌లో మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడెంకల స్కోర్‌ను అందుకున్నాడు. 2019లో వెస్టిండీస్‌పై చివరిసారిగా వన్డే శతకాన్ని అందుకున్న కోహ్లీ.. మళ్లీ ఇన్నాళ్లకు సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 72వ సెంచరీ నమోదు చేసిన కింగ్ కోహ్లీ.. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్(71)ను అధిగమించాడు. అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సచిన్ టెండూల్కర్(100) తర్వాతి స్థానంలో విరాట్(72) నిలిచాడు.
యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో అతనికి అండగా యాంకర్ రోల్ పోషించిన విరాట్.. అతను ఔటైన తర్వాత భారీ సిక్సర్‌తో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ 2022 ముందు వరకు నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్.. నెల రోజుల సుదీర్ఘ విరామంతో మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.
ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ మూడేళ్ల తర్వాత 71 సెంచరీ నమోదు చేశాడు. కాకతాళీయమో ఏమో కానీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే 71, 72వ సెంచరీలు బాదిన కోహ్లీ.. ఈ రెండు శతకాలను సిక్సర్లతో అందుకున్నాడు. ప్రస్తుతం ఈ గణంకాలు కోహ్లీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఆసియాకప్‌లో అఫ్గాన్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉండగా.. రాహుల్ జట్టును నడిపించాడు. తాజా మ్యాచ్‌కు రోహిత్ బొటన వేలి గాయంతో దూరమైన విషయం తెలిసిందే.
ఈ సెంచరీతో కోహ్లీ కొన్ని భారీ రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా పాంటింగ్ రికార్డును అధిగమించిన విరాట్..బంగ్లాదేశ్‌పై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. అలాగే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ కోహ్లీ వన్డేల్లో వెయ్యి పరుగులు బాదాడు.
మూడు దేశాలపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా కోహ్లీ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు శ్రీలంక మాజీ దిగ్గజాలు డిసిల్వా, అర్జున రణతుంగా సరసన చేరాడు. ఇక అత్యధిక దేశాల్లో 1000 రన్స్ చేసిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఏకంగా ఐదు దేశాల్లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు.
ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210) విధ్వంసకర డబుల్ సెంచరీతో పాటు విరాట్ కోహ్లీ శతక్కొట్టడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 409 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, టస్కిన్ అహ్మద్, ఎబాదత్ హోస్సెన్ రెండేసి వికెట్లు తీయగా..మెహ్‌దీ హసన్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీసారు.