Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సోషల్‌ మీడియాలో వైరల్‌.. మునుపెన్నడూ చూడని గెటప్‌లో ధోనీ

MS Dhoni's Brand New Look, Spotted At Jaipur Airport || Oneindia Telugu
Viral Video: MS Dhoni Spotted at Jaipur Airport in a brand new look

ముంబై: లెహ్‌లో సైనిక విధులు ముగించుకొన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ కొత్త లుక్‌లలో దర్శనమిస్తున్నాడు. ఇటీవల ఖద్దరు దుస్తులు ధరించి రాజకీయ నాయకుడిగా మారిపోయిన మహీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. దీంతో మహీ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడా? అనే అనుమానాలు కలిగాయి. అయితే రాజకీయ నాయకుడి గెటప్ ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం అని తర్వాత తెలిసింది.

జైపూర్‌ విమానాశ్రయంలో మహీ:

జైపూర్‌ విమానాశ్రయంలో మహీ:

తాజాగా మహీ మరో కొత్త లుక్‌తో జైపూర్‌ విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. జైపూర్‌లో ఓ వేడుకకు మహీ శనివారం హాజరయ్యాడు. అక్కడ తన స్నేహితులు, అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆదివారం ఉదయం వేడుకకు హాజరై వస్తూ మీడియాకి చిక్కాడు. మహీ తలకు నల్లటి బంధన్‌ కట్టుకుని కనిపించాడు. విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమానులు అతడిని కలవడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు అందరిని పక్కకు పంపుతూ మహీకి దారిచ్చారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌:

సోషల్‌ మీడియాలో వైరల్‌:

ఇక విమానాశ్రయం వెలుపల జనం భారీగా ఉండటంతో మహీని తన కారులో తీసుకురావడానికి భద్రతా సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. మునుపెన్నడూ చూడని గెటప్‌లో ఉన్న మహీ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. మహీ అభిమానులు ఫొటోలు, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. కొత్త లుక్‌లో మహీ బాగున్నాడని అభిమానులు ప్రశంశిస్తున్నారు.

యాడ్‌ షూటింగ్‌ కోసం ముంబై:

యాడ్‌ షూటింగ్‌ కోసం ముంబై:

వెస్టిండీస్‌ పర్యటనకు రెండు నెలలు విరామం ప్రకటించిన మహీ.. భారత సైన్యంలో చేరి విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ అయిన మహీ.. 15 రోజులు లెహ్‌లో విధులు నిర్వర్తించాడు. అక్కడ గార్డ్, పెట్రోలింగ్ లాంటి విధుల్లో భాగమయ్యాడు. తాజాగా విధుల నుండి విరామం తీసుకొన్న మహీ.. ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం ముంబై వెళ్లాడు.

అత్యంత చెత్త రికార్డు: 95 నిమిషాలు.. 45 బంతులు.. 0 పరుగులు

చివరి రోజున సియాచెన్‌కు:

మహీ కాశ్మీర్‌లో పెట్రోలింగ్ మరియు గార్డు విధుల్లో బాగమయ్యాడు. అక్కడ ఒక సాధారణ సైనికుడి జీవితాన్ని గడిపాడు. అంతేకాదు అక్కడి సైన్యంతో వాలీ బాల్ ఆడడం, పాటలు పాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి చేసాడు. తన అనుభవాలను అక్కడి రెజిమెంట్‌ సభ్యులతో పంచుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే లేహ్‌ను సందర్శించిన మహీ.. ఆగస్టు 15న ఫార్వర్డ్ పోస్టు వద్ద జాతీయ జెండాను ఎగురవేశాడు. విధుల్లో భాగంగా తన చివరి రోజున సియాచెన్ హిమానీ నదంను సందర్శించాడు. అక్కడ సైనికులు నివసించే క్లిష్ట పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు.

Story first published: Sunday, August 25, 2019, 17:28 [IST]
Other articles published on Aug 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+