
గుట్కా మ్యాన్..
శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో మైదానంలోని ప్రేక్షకులంతా చప్పట్లతో అతన్ని అభినందించారు. అదే సమయంలో స్టార్ స్పోర్ట్స్ కెమేరామాన్ ఆ గుట్కా మ్యాన్ జంటపై ఫోకస్ చేశాడు. కెమేరా తనవైపు ఫోకస్ అవుతున్న విషయాన్ని గుర్తించి చేయి కూడా ఊపాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఆ తర్వాత ప్రారంభమైంది. అతని వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతన్ని గుట్కా మ్యాన్ అని పిలుస్తూ నెటిజన్లు తెగ పోస్టులు పెట్టారు. అతని ఫొటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఫన్నీ మీమ్స్..
సదరు గుట్కా మ్యాన్‌ను మ్యాన్ ఆఫ్ ది డేగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఇలా గుట్కా నములుతూ దొరికిన వ్యక్తి పేరు షోబిత్ పాండే. అయితే సోషల్ మీడియా అతను ఇలా ఫేమస్ అవ్వడంపై అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తాను గుట్కా నమలడం లేదని, తన పక్కన ఉన్న అమ్మాయి తన సోదరని పేర్కొన్నాడు. కానీ సోషల్ మీడియాలో దారుణమై పోస్టింగ్స్‌తో పాటు తన చెల్లి పట్ల అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని తెలిపాడు. ప్రముఖ వార్త ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ తన కష్టాలను చెప్పుకొచ్చాడు.

గుట్కా తినలేదు..
'ముందుగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే.. నేను గుట్కా కానీ పొగాకు కానీ నమలడం లేదు. నేను నోట్లో వక్కపొడి వేసుకొని ఉన్నాను. అదే సమయంలో నా ఫ్రెండ్‌తో కాల్ మాట్లాడుతున్నా. అతను కూడా మ్యాచ్ చూడటానికి వచ్చాడు. కానీ స్టేడియంలో వేరే చోట కూర్చున్నాడు. అందుకే కాల్ చేసి ఎక్కడున్నావని అడిగాను. ఆ కాల్ కూడా 10 సెకెన్లకంటే ఎక్కువ సేపు మాట్లాడలేదు. ఆ తర్వాత అదే ఫ్రెండ్ నా వీడియో, ఫొటో వైరల్ అయ్యిందని చెప్పాడు.' అని షోబిత్ చెప్పుకొచ్చాడు.

ఆమె నా చెల్లి..
తన వీడియో వైరల్ అవ్వడంపై తనకు ఎలాంటి బాధ లేదని, కానీ సోదరిని ప్రేయసిగా మార్చడమే బాధగా ఉందన్నాడు. 'నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఈ వీడియో వైరల్ కావడం పట్ల భయపడటం లేదు. కాకపోతే నా సోదరి పట్ల దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా నాకు మీడియా హౌసెస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇదంతా నాకు చికాకు కలిగిస్తుంది.'షోబిత్ పాండే చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
