IND vs SL: కొంపముంచిన విప్రజ్ నిగమ్, అర్షద్ ఖాన్.. సూపర్ ఓవర్‌లో ఓడిన భారత్!
శ్రీలంక పర్యటనలో భారత్-ఏ జట్టుకు మరో పరాజయం ఎదురైంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక-ఏ సూపర్ ఓవర్‌లో భారత్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది.
విప్రజ్ నిగమ్ అత్యుత్సాహం, అర్షద్ ఖాన్ తప్పిదం భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఓటమితో భారత్-ఏ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అఫ్గానిస్థాన్‌తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా భారత్-ఏ ఫైనల్ చేరలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఒకే ఒక్కటి గెలిచింది.
కొంపముంచిన నోబాల్..
ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. అర్షద్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో సిక్సర్ బాది భారీ స్కోర్ అందించాడు. అర్షద్ ఖాన్ నోబాల్ వేయడం భారత్ కొంపముంచింది.
అనంతరం భారత్-ఏ సూపర్ ఓవర్‌లో 10 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూర్యాన్ష్ షెడ్గే బౌండరీ బాదడంలో విఫలమవ్వగా.. వైభవ్ సూర్యవంశీ 3 బంతులాడి ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.

ఆదుకున్న సూర్యన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యన్ష్ షెడ్గే(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72), విప్రజ్ నిగమ్(49 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(21), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(11), రుతురాజ్ గైక్వాడ్(37), తిలక్ వర్మ(23), ఆయుష్ బదోని(15), నిషాంత్ సింధు(6) దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక ఏ బౌలర్లలో మహమ్మద్ షిరాజ్(3/33), విజయ్‌కాంత్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. సహాన్, వనుజ సహన్, మతులన్ తలో వికెట్ తీసారు.
అనంతరం శ్రీలంక-ఏ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 265 పరుగులే చేసింది. సదీర సమరవిక్రమా(113 బంతుల్లో 7 ఫోర్లతో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. నిరోషన్ డిక్‌వెల్లా(37), వానుజ సాహన్(25) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఆయుష్ బదోని 2 వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అనుకూల్ రాయ్, సూర్యాన్ష్ షెడ్గే తలో వికెట్ తీసారు.
విప్రజ్ నిగమ్ తప్పిదంతో..
266 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక-ఏ 10/0 స్కోర్‌తో తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. భారత బ్యాటర్లు పిచ్ మధ్యలో పరుగెత్తడంతో అంపైర్లు 10 రన్స్ పెనాల్టీ విధించారు. ముఖ్యంగా విప్రజ్ నిగమ్ చేసిన ఈ తప్పిదంతో శ్రీలంకకు 10 పరుగులు అప్పనంగా వచ్చాయి. ఇక శ్రీలంకకు ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందించారు. కానీ ఆ తర్వాత వరుస విరామాల్లో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడినా సదీరా సమరవిక్రమా ఒంటరి పోరాటం చేశాడు.
ఆరో వికెట్‌కు 51 పరుగులు.. 8వ వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. శ్రీలంక విజయానికి చివరి 6 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో 8వ వికెట్‌గా సమరవిక్రమా వెనుదిరగడంతో శ్రీలంక పతనం మొదలైంది. అర్షద్ ఖాన్ వేసిన 49వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమా ఔటవ్వగా.. తర్వాతి నాలుగు బంతుల్లో 4 సింగిల్స్ తీసిన శ్రీలంక మ్యాచ్‌ను టై చేసింది. ఆఖరి బంతికి రెండో పరుగు తీసే క్రమంలో గుణశేఖర్ రనౌటవ్వడం భారత్‌కు కలిసొచ్చింది.
సూపర్ ఓవర్ కోసం హైడ్రామా..
మ్యాచ్ టై అయిన అనంతరం మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. బ్యాడ్ లైట్ అంటూ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించేందుకు విముఖత వ్యక్తం చేయగా.. భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మ అసహనం వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టాడు. చివరకు అంపైర్లు సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications