IPL 2020 playoffs: ఒక బెర్తు కోసం నాలుగు జట్లు పోటీ.. సన్‌రైజర్స్ గెలిస్తేనే.. లేదంటే!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్ లీగ్ దశ చివరి అంకం దిశగా సాగుతోంది. ప్లేఆఫ్స్‌కు మూడు బెర్తులు దాదాపు ఖాయమయ్యాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలో 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ ముంగిట నిలిచాయి. తర్వాతి దశకు చేరడానికి ఆ జట్లకు మరొక్క విజయం చాలు. ప్రస్తుత పరిస్థితుల్లో జోరు మీదున్న ఆ మూడు జట్లకు అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ మిగిలిన ఒక్క బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉంది.

ఒక బెర్తు కోసం నాలుగు జట్లు పోటీ:
శుక్రవారం ముంబై చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ 8 ఓటములతో రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఒక బెర్తు కోసం మిగిలినవి.. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్. అనూహ్య ఫలితాలు లేకుంటే తప్ప.. ఈ నాలుగు జట్లు చివరి బెర్తు కోసం పోటీపడనున్నాయి. 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో కేకేఆర్ రేసులో కాస్త మెరుగ్గా కనిపిస్తుండగా.. 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఉన్న రాజస్థాన్ పరిస్థితి కష్టంగానే ఉంది. మరోవైపు చెరో నాలుగు విజయాలతో ఉన్న సన్‌రైజర్స్, పంజాబ్ తమ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ముందంజ వేయాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చివరి ప్లేఆఫ్ బెర్త్ కోసం సాగే పోరాటం ఆసక్తి రేపడం ఖాయం.

సన్‌రైజర్స్ విజయం సాధిస్తే.:
అయితే ప్లేఆఫ్స్ రేసులో నిలిచే జట్లేవి, నిష్క్రమించేవి ఏవి అనే విషయం శనివారం తేలనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. రాత్రి 7.30 గంటలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఢిల్లీ చేతిలో కోల్‌కతా ఓడి, పంజాబ్‌పై సన్‌రైజర్స్ విజయం సాధిస్తే.. ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంటుంది. కోల్‌కతా, హైదరాబాద్ జట్ల ఖాతాలో పాయింట్లు సమం అయినప్పటికీ.. నెట్ రన్ రేట్ కారణంగా ఆరెంజ్ ఆర్మీ ముందంజలో ఉంటుంది.

పంజాబ్‌పై గెలిస్తే:
కోల్‌కతా చేతిలో గెలిచే స్థితిలో ఓడి ఇబ్బందుల్లో పడిన సన్‌రైజర్స్.. ఈరోజు పంజాబ్‌పై గెలిస్తే మాత్రం మెరుగైన స్థితిలో నిలిచినట్లే. ఒకవేళ కోల్‌కతా, పంజాబ్ గెలిస్తే మాత్రం సన్‌రైజర్స్ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్టే. సన్‌రైజర్స్ గత నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లోనే గెలుపొందింది. అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఘన విజయం సాధించింది. స్టార్ ఓపెనర్లు తక్కువ స్కోరుకే ఔటైనా.. మనీష్ పాండే, విజయ్ శంకర్ జట్టును గెలిపించారు. మిడిల్ ఆర్డర్ గాడిలో పడడం సన్‌రైజర్స్‌కు కలిసి వచ్చేఅంశం.
ధోనీ చెప్పింది 100శాతం నిజమేగా!! రుతురాజ్‌లో కసి కాదు కదా.. ఆడాలన్న శ్రద్ధ కూడా లేదు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications