Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ చెప్పింది 100శాతం నిజమేగా!! రుతురాజ్‌లో కసి కాదు కదా.. ఆడాలన్న శ్రద్ధ కూడా లేదు!!

IPL 2020: MS Dhoni Was 100 percent Right, Fans fire on Ruturaj Gaikwad after Duck

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా మ్యాచ్ జరుగుతుండగానే కొందరు మండిపడ్డారు. ఇటీవల ఓ మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ధోనీ ముందు ప్రస్తావించగా.. తమ యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించలేదని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు.

జాదవ్, చావ్లాను పక్కనపెట్టి:

యంగ్‌స్టర్స్‌లో కనిపించని స్పార్క్.. కేదార్ జాదవ్, పీయుష్ చావ్లాలో కనిపించిందా అని సోషల్ మీడియాలో ఎంఎస్ ధోనీపై మండిపడ్డారు. జట్టులో అందరూ అంకుల్స్ ఉన్నారని, కుర్రాళ్లకు ఛాన్స్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సౌరవ్ గంగూలీ అప్పుడు అవకాశం ఇవ్వకుంటే.. నువ్వు ఎక్కడ ఉండేవాడివని మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ధోనీపై సెటైర్లు వేశాడు. ఈ విమర్శలనేపథ్యంలో శుక్రవారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సీనియర్లు కేదార్ జాదవ్, పీయుష్ చావ్లాను పక్కనపెట్టి .. యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌, ఎన్ జగదీశన్‌కు అవకాశం ఇచ్చాడు.

రుతురాజ్ డకౌట్:

వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్‌, ఎన్ జగదీశన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముంబై స్టార్ బౌలర్లు ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతులకు అల్లాడిపోయారు. బోల్ట్ వేసిన మొదటి ఓవర్లో రుతురాజ్ డకౌట్ అయితే.. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జగదీశన్ డకౌట్ అయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్.. ఒక్క బాల్ కూడా ఆడాలనే ఉద్దేశంతో కనిపించలేదు. ఇక జగదీశన్ అయితే అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో చెన్నై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

కనీసం ఫీల్డింగ్ అన్న చేయిరా:

కనీసం ఫీల్డింగ్ అన్న చేయిరా:

యంగ్ స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్‌, ఎన్ జగదీశన్‌ ఘోరంగా విఫలమవడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఆటాడుకుంటున్నారు. 'ఎంఎస్ ధోనీ చెప్పింది 100శాతం నిజమేగా.. ఇద్దరిలో కసి కాదు కదా.. ఆడాలన్న శ్రద్ధ కూడా లేదు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'ఒక యువకుడికి మాత్రమే స్పార్క్ ఉంది.. అదే కరన్', 'రుతురాజ్ బాగా ఫీల్డింగ్ చేశాడు.. ఫోర్ వదిలేయలేదు', 'బ్యాటింగ్ ఎలాగూ రాదు.. కనీసం ఫీల్డింగ్ అన్న చేయిరా' అని నెటిజన్లు మండిపడుతున్నారు.

10 వికెట్ల తేడాతో చిత్తు:

10 వికెట్ల తేడాతో చిత్తు:

శుక్రవారం ముంబై‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. బౌల్ట్‌ (4/18), బుమ్రా (2/25), చహర్ ‌(2/22) ధాటికి 30 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. సామ్‌ కరన్‌ (47 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 12.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 116 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (37 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్‌ (37 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు.

Story first published: Saturday, October 24, 2020, 9:07 [IST]
Other articles published on Oct 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+