For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం మహిళా క్రికెటర్లు సమోసాలు తిని ప్రపంచకప్ ఆడారు.. బీసీసీఐపై సంచలన ఆరోపణలు!

 Vinod Rai reveals issues faced by Indian team during 2017 Women’s WC

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)‌ క్రికెట్‌కు పెద్దన్న. పేరుకే భారత క్రికెట్ బోర్డు అయినప్పటికీ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. క్రికెట్ ఆడే దేశాల్లో అత్యంత ధనవంతమైన బోర్డు. అలాంటి బోర్డు తరఫున ఆడుతున్న మహిళా క్రికెటర్లకు తినడానికి సరైన తిండి కూడా పెట్టలేదంట. వాడి పడేసిన జెర్సీలను ఇచ్చారంట. వన్డే ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలోనూ మహిళా క్రికెటర్లపై వివక్ష చూపించారంట. ఈ విషయాలన్ని చెప్పింది ఎవరో కాదు.. గతి తప్పిన బీసీసీఐని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ఆదేశాలతో గాడిన పెట్టిన క్రికెట్‌ పాలక కమిటీ (సీఓఏ) మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడించారు.

మూడేళ్ల కాలంలో..

మూడేళ్ల కాలంలో..

వినోద్‌ రాయ్‌ను సూప్రీంకోర్టు.. 2017-19 మధ్య బీసీసీఐ స్పెషల్‌ కమిటి అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బీసీసీఐలో ఎన్నికలు జరిగే వరకు వినోద్‌ రాయ్‌ సహా రామచంద్ర గుహ, విక్రమ్‌ లిమాయే, భారత మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీలతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ బోర్డు వ్యవహారాలను చూసుకుంది. అయితే ఈ మూడేళ్ల కాలంలో బీసీసీఐలో జరిగిన లోటు పాట్లతో పాటు మహిళా క్రికెటర్లపై చూపిన వివక్ష గురించి వినోద్‌ రాయ్‌ ..''నాట్‌ జస్ట్‌ ఏ నైట్‌ వాచ్‌మన్‌'' అనే పుస్తకంలో ప్రస్తావించారు.

వాడేసిన జెర్సీలు..

వాడేసిన జెర్సీలు..

'బీసీసీఐ మహిళా క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని నాకు అనిపించింది. 2006 వరకు మహిళా క్రికెటర్లపై వివక్ష దారుణంగా ఉండేది. ఎంతలా అంటే వారికి కనీసం కొత్త జెర్సీలు కూడా ఇచ్చేవారు కాదు. వారి మ్యాచ్‌ల సంఖ్య తక్కువని పురుషుల వాడిన జెర్సీలనే కట్‌ చేసి మళ్లీ కుట్టి వాటిని మహిళా క్రికెటర్లకు అందించేవారు. ఒక రకంగా వాడేసిన జెర్సీలను మహిళా క్రికెటర్లకు ఇచ్చేవారు. అయితే శరద్‌ పవార్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా వచ్చాకా.. పరిస్థితి కొంత నయమైంది.

బ్రేక్‌ఫాస్ట్ సమోస..

బ్రేక్‌ఫాస్ట్ సమోస..

ఆయన మహిళల, పురుషుల క్రికెట్‌ను ఒకే దగ్గరకు చేర్చాలనే కొత్త ఆలోచనతో వచ్చారు. దానివల్ల మహిళా క్రికెటర్ల బతుకులు చాలావరకు బాగుపడ్డాయి. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ అనేది రావడం వల్ల వివక్ష కాస్త తగ్గింది. కానీ ఇప్పటికి ఎక్కడో ఒక చోట అది కొనసాగుతూనే ఉంది. 2017లో నేనే బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు.. భారత మహిళల జట్టు 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరింది. ఆ ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 171 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ టీమిండియాను ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. అయితే ఇంత మంచి ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ ప్రీత్‌కౌర్‌కు మ్యాచ్‌కు ముందు సరైన ఫుడ్‌ ఇవ్వలేదంటే నమ్ముతారా.

పరుగెత్తలేక సిక్స్‌లు..

పరుగెత్తలేక సిక్స్‌లు..

ఆ విషయం హర్మన్‌ స్వయంగా చెప్పింది. 171 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ తర్వాత హర్మన్‌తో ఫోన్‌లో మాట్లాడా.''సార్‌.. పరుగెత్తడానికి శక్తి లేక బలాన్ని కుంచించుకొని సిక్స్‌లతోనే ఇన్నింగ్స్‌ ఆడాను. దానికి కారణం మాకు సరైన ఫుడ్‌ లేకపోవడమే. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మేమున్న హోటల్‌ సిబ్బంది.. ఈరోజు మీకు బ్రేక్‌ఫాస్ట్‌ ఏం లేదని.. సమోసాలతోనే సరిపెడుతున్నామని చెప్పారు. ఆ ఒ‍క్క సమోసాతోనే నా శక్తినంతా కుంగదీసుకొని ఇన్నింగ్స్‌ ఆడాను.'' అంటూ చెప్పుకొచ్చింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. బీసీసీఐ మహిళా క్రికెటర్లను సరిగ్గా పట్టించుకోలేదని.

మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలి..

మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలి..

ఈ మధ్యకాలంలో నాకు తెలిసి పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్‌ ఆడుతున్నారు. వాళ్లకు సరైన ట్రైనింగ్‌, కోచింగ్‌ అవసరాలు, ట్రావెల్‌ ఖర్చులు, క్రికెట్‌ కిట్‌‌లు అందించడంతో పాటు మ్యాచ్‌ ఫీజులు సక్రమంగా చెల్లిస్తే మరింత ముందుకెళ్లడం సాధ్యం. బీసీసీఐని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. అందులో ఉన్న లోపాలు మాత్రమే ఎత్తిచూపాను. ఇలాంటివి తొందరగా పరిష్కరించుకుంటే భారత క్రికెట్‌కే మంచిదనే నా అభిప్రాయం' అంటూ వినోద్ రాయ్ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, April 18, 2022, 18:28 [IST]
Other articles published on Apr 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+