
ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా వైఫల్యంపై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరణ ఇచ్చాడు. టర్నింగ్ ట్రాక్స్‌పై ఆడటమే టీమిండియా బలమని చెప్పుకొచ్చాడు. తాము ఊహించనదాని కంటే ఎక్కువ బంతి టర్న్ అయ్యిందని, దాంతో తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు. బ్యాటింగ్ పరంగా ఈ రోజు తమకు కలిసి రాలేదని పేర్కొన్నాడు. పిచ్ క్యురేటర్‌ను కూడా తప్పు పట్టాల్సిన పని లేదని, వికెట్ సిద్దం చేయడానికి అతనికి తగినంత సమయం దొరకలేదన్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 32.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ(22), శుభ్‌మన్ గిల్ (21) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నేమన్ ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.
తొలి రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.. తమకు ఇది బ్యాడ్‌డేగా చెప్పుకొచ్చాడు. 'కచ్చితంగా ఇది చాలెంజింగ్ వికెట్. మేం ఊహించినదానికంటే ఎక్కువ టర్న్ అయ్యింది. మాయిశ్చర్ ఉండటంతో ఉదయం బంతి బాగా టర్న్ అయిందని భావిస్తున్నా. మేం మరిన్ని పరుగులు చేయాల్సింది. కానీ మా జట్టులో ఎవరూ కూడా చెత్త క్రికెట్, నిర్లక్ష్యపు షాట్స్ ఆడలేదు. బ్యాటింగ్ యూనిట్‌గా ఇది మాకు బ్యాడ్ డే.
టర్నింగ్ ట్రాక్స్‌పై ఆడటం టీమిండియా అతిపెద్ద బలం. దాంతోనే మేం ఈ తరహా ట్రాక్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. సాధారణంగా టెస్ట్‌ల్లో నాలుగు, ఐదో రోజు ఆటలో ఇలాంటి టర్న్ కనిపిస్తోంది. కానీ ఈ వికెట్‌పై తొలి రోజు బంతి ఎక్కువగా టర్న్ అయ్యింది. వికెట్ తయారు చేసిన క్యురేటర్‌ది కూడా తప్పు లేదు. ఎందుకంటే పిచ్‌ను సిద్దం చేయడానికి అతనికి తగిన సమయం దొరకలేదు. ఈ మైదానంలో రంజీ సీజన్ జరగడం.. ధర్మశాల వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ చివరి నిమిషంలో ఇక్కడికి షిఫ్ట్ అవ్వడంతో మంచి వికెట్ తయారు చేయడానికి వారికి తగిన సయయం లభించలేదు.
మ్యాచ్ జరుగుతున్నా కొద్ది వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. పుజారా వికెట్ విషయంలో అతను బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఆఫ్ స్టంప్ దిశగా పిచ్ అయిన బంతి స్ట్రైట్‌గా వస్తుందనుకున్నాడు. కానీ బంతి టర్న్ అయ్యి వికెట్లను ఎగరగొట్టింది. ఇక డబ్ల్యూటీసీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ జట్టు హోమ్ కండీషన్స్‌లో మ్యాచ్‌లు గెలవాలని భావిస్తున్నాయి. ఆ క్రమంలోనే అనుకూలమైన వికెట్లను సిద్దం చేసుకొని ఆడుతున్నాయి.'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.