Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే కేఎల్ రాహుల్‌కు వరుస అవకాశాలు.. రోహిత్ సెంచరీ వెరీ స్పెషల్: టీమిండియా బ్యాటింగ్ కోచ్

 Vikram Rathour backs KL Rahul’s form, says “He has a hundred in South Africa and one in England”

కాన్పూర్: ఆస్ట్రేలియా‌తో తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సెంచరనీ కొనియాడాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై సెంచరీ చేయడం అంత సులువైన పనికాదని, తన శైలికి భిన్నంగా ఆడి రోహిత్ శతకం సాధించాడని విక్రమ్‌ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన విక్రమ్ రాథోడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పేలవ ఫామ్‌తో తడబడుతున్న కేఎల్ రాహుల్‌కు వరుస అవకాశాలు ఇవ్వడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.

 వెరీ స్పెషల్ సెంచరీ..

వెరీ స్పెషల్ సెంచరీ..

'రోహిత్ శర్మ నుంచి వచ్చిన స్పెషల్‌ ఇన్నింగ్స్‌ ఇది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై రోహిత్ సత్తా చాటడం గొప్ప విషయం. ఇప్పటికే రోహిత్ చాలా గొప్ప మ్యాచ్‌లు ఆడాడు. అయితే రోహిత్ కెరీర్‌లో అతను సాధించిన మూడు సెంచరీలు మాత్రమే హైలైట్. చెపాక్‌ స్టేడియంలో 161 పరుగులు, ఓవల్‌ మైదానంలో సెంచరీతోపాటు, నాగ్‌పుర్‌ వేదికగా ఆసీస్‌పై చేసిన శతకం. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై నిలకడను ప్రదర్శిస్తూనే అద్భుతంగా ఆడాడు.

శైలికి భిన్నంగా..

ఇంగ్లండ్‌లో సీమ్‌ ట్రాక్‌పైనా పరుగులు రాబట్టాడు. కానీ ఈ ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడితే.. అతణ్ని పరుగుల కోసం శ్రమించేలా ఆసీస్‌ చేసింది. సాధారణంగా అయితే కొన్ని పరుగులు చేశాక అతను సులభంగా సాగిపోతాడు. ఈ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడటం కోసం రోహిత్ నెట్స్‌లో చాలా శ్రమించాడు. ఈ వికెట్ తగ్గట్లు తన దూకుడును తగ్గించుకొని మరీ ఆడటం కోసం రోహిత్ తీవ్రంగా కష్టపడ్డాడు. ఇక అక్షర్‌ పటేల్ నుంచి మేం బౌలింగ్‌ను ఆశించాం. కానీ, బ్యాటింగ్‌ చేయడం కూడా బోనస్‌లాంటిదే.

అందుకే రాహుల్‌కు చాన్స్..

అందుకే రాహుల్‌కు చాన్స్..

ఇప్పటికే మ్యాచ్‌ మన చేతుల్లోకి వచ్చిందని చెప్పలేను. చివరి బంతి వరకూ ఏమవుతుందో తెలీదు. గత 10 టెస్టుల్లో కేఎల్ రాహుల్‌ రెండు సెంచరీలు చేశాడు. అవి ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాల్లో సాధించినవి. అతను విరాట్, రోహిత్‌లా టాలెంటెడ్ ప్లేయర్. బ్యాడ్ ఫేజ్ నుంచి అతి త్వరలోనే బయటపడుతాడు. అతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం మాపై ఉంది'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

భారీ ఆధిక్యంలో భారత్..

భారీ ఆధిక్యంలో భారత్..

బంతి బాగా తిరుగుతున్న వికెట్‌పై భారత్‌ ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల ఆధిక్యం సాధించింది. రోహిత్‌ శర్మ ( 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 120) కెప్టెన్‌గా తొలి టెస్టు శతకానికి తోడు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (170 బంతుల్లో 9 ఫోర్లతో 66 బ్యాటింగ్‌), అక్షర్‌ పటేల్‌ ( 102 బంతుల్లో 8×4 8 ఫోర్లతో 52 బ్యాటింగ్‌) కూడా అర్ధశతకాలతో రాణించడంతో శుక్రవారం ఆటను భారత్‌ 321/7తో ముగించింది.

ఆస్ట్రేలియా అరంగేట్ర స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ (5/82) అయిదు వికెట్లు సాధించాడు. మూడో రోజు జడేజా, అక్షర్‌ ఎంత సేపు బ్యాటింగ్‌ చేస్తారు.. జట్టుకు ఎంత ఆధిక్యం లభిస్తుంది.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్లను ఎంత త్వరగా ఆలౌట్‌ చేస్తారనే దానిపై మ్యాచ్‌ గమనం ఆధారపడి ఉంది.

Story first published: Saturday, February 11, 2023, 7:49 [IST]
Other articles published on Feb 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+