Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vijaykumar Vyshak: ఎవరు రా.. నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్?

హైదరాబాద్: 'విజయ్‌కుమార్ వైశాక్' ప్రస్తుతం భారత్ క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు. తన అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్‌లోనే అసాధారణ బౌలింగ్‌తో ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యువ పేసర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కుమార్.. సంచలన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసాడు. తన తొలి ఓవర్‌లోనే ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేసిన విజయ్ కుమార్.. మూడో ఓవర్‌లో డేంజరస్ అక్షర్ పటేల్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇక చివరి ఓవర్‌లో లలిత్ యాదవ్‌ను ఔట్ చేసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

 Vijaykumar Vyshak

స్లోయర్, నకుల్ బాల్స్‌తో పాటు యార్కర్లు వేయడంలో స్పెషలిస్ట్ అయిన విజయ్‌కుమార్.. ఆర్‌సీబీ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ సంచలన ప్రదర్శనతో విజయ్‌కుమార్ వైశాక్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తికనబరుస్తున్నారు. అతని వివరాలను తెలుసుకునేందుకు గూగులమ్మను ఆశ్రయిస్తున్నారు.

కర్ణాటకకు చెందిన విజయ్‌‌కుమర్ వైశాక్.. దేశవాళీ క్రికెట్‌‌లో ఆరాష్ట్ర జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. విజయ్ హజారే 2020-21 సీజన్‌తో కర్ణాటక జట్టు తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కుమార్.. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021తో టీ20ల్లో అరంగేట్రం చేసిన విజయ్ కుమార్.. 14 మ్యాచ్‌ల్లో 6.92 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా విజయ్‌‌కుమార్ వైశాక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

దాంతో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు నెట్ బౌలర్‌గా సేవలందించాలని అతను ప్రయత్నించాడు. కానీ ఆయా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అతనికి నెట్‌బౌలర్‌గా అవకాశం ఇచ్చింది. ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ రజత్ పటీదార్ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో అతని స్థానాన్ని విజయ్‌కుమార్ వైశాక్‌తో భర్తీ చేసింది.

నెట్స్‌లో విజయ్‌కుమార్ బౌలింగ్ ఆడిన ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అతని బంతులకు ఫిదా అయ్యి అవకాశం ఇచ్చారు. అతని బౌలింగ్‌లో ఉన్న వేరియేషన్స్ జట్టుకు ఉపయోగపడతాయని భావించి చాన్స్ ఇవ్వగా.. విజయ్‌కుమార్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌కు ఫిదా అయిన ఆర్‌సీబీ అభిమానులు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇన్నాళ్లు ఎక్కడున్నావ్? అని ప్రశ్నిస్తున్నారు. 'ఎవరు రా.. నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్?'అనే డైలాగ్‌తో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Story first published: Saturday, April 15, 2023, 21:08 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+