శంకరన్నా మళ్లీ ముంచేసాడు.. ఆఖరి 6 బంతుల్లో ఒక్క పరుగు చేయలేకపోయిన 3D ప్లేయర్!
టీమిండియా మాజీ క్రికెటర్, తమిళనాడు స్టార్ ప్లేయర్ విజయ్ శంకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. జిడ్డు బ్యాటింగ్కు మారుపేరైన శంకర్.. మరోసారి పేలవ బ్యాటింగ్తో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు వీడ్కోలు పలికిన విజయ్ శంకర్.. ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు.
ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో క్యాండీ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయ్ శంకర్ పేలవ బ్యాటింగ్తో ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఆఖరి ఓవర్లో తమ జట్టు విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. ఒక్క పరుగు చేయలేకపోయాడు.
ఒక్క పరుగు చేయలేక..
గురువారం పల్లెకెలె వేదికగా జాఫ్నా కింగ్స్, క్యాండీ రాయల్స్ మధ్య జరిగిన 18వ లీగ్ మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జాఫ్నా నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది. అనంతరం క్యాండీ రాయల్స్ 20 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్లో క్యాండీ రాయల్స్కు 22 పరుగులు అవసరం కాగా.. విజయ్ శంకర్ ఒక్క పరుగు చేయకపోగా.. ఆఖరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.

ఈ ఓవర్కు ముందు విజయ్ శంకర్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. దాంతో క్యాండీ రాయల్స్ను విజయ్ శంకర్ గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ మదుశంకా వేసిన ఆఖరి ఓవర్లో విజయ్ శంకర్ ఒక్క పరుగు చేయలేకపోయాడు.
మెయిడిన్ వికెట్ ఓవర్..
వరుసగా ఐదు బంతులను డాట్ చేశాడు. కనీసం ఆఖరి బంతిలోనైనా సిక్స్ కొడుతాడని భావించగా.. డీప్ బ్యాక్వార్డ్ స్క్వేర్ లెగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మధుశంక ఆఖరి ఓవర్ను వికెట్ మెయిడెన్గా వేసి జాఫ్నా కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 క్రికెట్లో 20వ ఓవర్లో వికెట్-మెయిడెన్గా వేసిన బౌలర్ల జాబితాలో మధుశంక చేరాడు. గతంలో జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని, మహమ్మద్ అమీర్ ఈ ఫీట్ సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న విజయ్ శంకర్ ఆఖరి ఓవర్లో 22 పరుగులు చేయకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఆటగాడిని 2019 వన్డే ప్రపంచకప్కు ఎంపిక చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. అంబటి రాయుడిని కాదని 3డీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్ను 2019 వన్డే ప్రపంచకప్ ఆడించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

