IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు విజయ్ శంకర్.. దరిద్రం పోయిందన్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్!

బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ. 1.40 కోట్ల ధరకు తీసుకుంది. ఇక విజయ్ శంకర్‌ను గుజరాత్ తీసుకోవడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన విజయ్ శంకర్ చెత్తాటతో జట్టు ఓటములకు కారణమయ్యాడు. ఆల్‌రౌండర్‌గా అతని కోసం రూ.3.20 కోట్లు ఖర్చి చేసి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. కానీ ఒక్క సీజన్‌లో కూడా అతను జట్టుకు కలిసొచ్చే ఆట ఆడలేదు.
దరిద్రం పోయింది..
గత సీజన్‌లో అతని చెత్తాట కారణంగా గెలిచే మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిపాలైంది. 10-12 పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితిలో కూడా విజయ్ శంకర్ ఏం చేయలేకపోయాడు. దాంతో అతనిపై అభిమానులు తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ్ శంకర్‌ను తీసుకుంటుందా? అని సందేహ పడ్డారు. చెన్నైకి చెందిన ఓనర్స్ కావడం, ఆ రాష్ట్ర ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో మళ్లీ విజయ్ శంకర్‌ను తీసుకుంటారా? అని కంగారు పడ్డారు. కానీ గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నెట్టింట పేలుతున్న సెటైర్లు..
ఈ సంతోషంలోనే సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. హమ్మయ్యా విజయ్ శంకర్ అయితే పోయాడని ఊపిరి పీల్చుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్ పని అయిపోయిందంటూ నవ్వుకునే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. శంకర్ కోసం ఎక్కడ బిడ్ చేస్తారోనని భయపడ్డామని, కావ్య పాప మంచి పని చేసిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట విజయ్ శంకర్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
కావ్య పాప దూకుడు..
శనివారం అలసత్వం ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం మాత్రం దూకుడు కనబరుస్తోంది. రెండో రోజు వేలంలో తొలి ఆటగాడైన సౌతాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్‌క్రమ్‌ను కొనుగోలు చేసింది. కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మాక్రమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో పోటీ పడి తీసుకుంది. మొదటి నుంచి మార్‌క్రమ్ కోసం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే వేలం రూ. 2 కోట్ల రూపాయలు దాటిన తర్వాత ముంబై ఇండియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ చివరకు 2 కోట్ల 60 లక్షల రూపాయలకు ఐడెన్ మాక్రమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా మార్‌క్రమ్ గతేడాది పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications