For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Vijay Hazare Trophy: ఒక్క పరుగుతో పంజాబ్ విజయం.. సర్ఫరాజ్ మెరుపు హాఫ్ సెంచరీ వృథా!

ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ పంజాబ్ సంచలన విజయాన్ని అందుకుంది. ఓటమి తప్పదని భావించిన మ్యాచ్‌లో చివరి వరకు అద్భుతంగా పోరాడి గెలిచింది. ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా ముంబైతో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ ఒక్క పరుగుతో తేడాతో విజయం సాధించింది. దాంతో ముంబై తరఫున 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన సర్ఫరాజ్ పోరాటం వృథా అయ్యింది.

లో స్కోరింగ్ థ్రిల్లర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 45.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అభిషేక్ శర్మ(8) నిరాశపర్చగా.. అన్మోల్ ప్రీత్ సింగ్(57), రమణ్‌దీప్ సింగ్(72) హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్(3/37) మూడు వికెట్లు తీయగా.. శశాంక్, శివమ్ దూబే, ఓంకార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సాయిరాజ్ పాటిల్‌కు ఓ వికెట్ దక్కింది.

Vijay Hazare Trophy Sarfaraz Khan s Fastest Fifty Goes in Vain as Punjab Edge Mumbai in Thriller

అనంతరం ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్(4/57), మయాంక్ మార్కండే(4/31) నాలుగేసి వికెట్లతో ముంబై పతనాన్ని శాసించారు. హర్‌ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్ తలో వికెట్ తీసారు.

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ బౌలర్లను వణికించాడు. అభిషేక్ శర్మ వేసిన ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా 6,4,6,4,6,4లతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.

సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో ముంబై సునాయసంగా గెలిచేలా కనిపించింది. 17.2 ఓవర్లకు 169/3 స్కోర్‌తో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్(15), శివమ్ దూబే(12), హార్దిక్ తమోర్(15) తీవ్రంగా నిరాశపర్చారు. పంజాబ్ 8 మంది బౌలర్లు ఉపయోగించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా ఈ గ్రూప్ నుంచి నాకౌట్‌ బెర్త్ దక్కించుకుంది. పంజాబ్ కూడా క్వార్టర్స్ చేరింది.

Story first published: Thursday, January 8, 2026, 18:08 [IST]
Other articles published on Jan 8, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+