Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే చాంపియన్ హిమాచల్ ప్రదేశ్.. ఫైనల్లో తమిళనాడుకి షాక్!

జైపూర్: దేశవాళీ వన్డే క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో చాంపియన్‌గా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడుతో ఆదివారం జరిగిన ఫైనల్లో వీజేడీ పద్దతి ప్రకారం 11 పరుగుల తేడాతో గెలుపొందిన హిమాచల్ ప్రదేశ్ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ కార్తీక్(103 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 116) సెంచరీతో చెలరేగగా.. బాబా ఇంద్రజిత్(71 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80),షారూఖ్ ఖాన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) విలువైన పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జస్వాల్ నాలుగు వికెట్లు తీయగా.. రిషీ ధావన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన హిమాచల్ ప్రదేశ్.. 47.3 ఓవర్లలో 4 వికెట్లకు 299 పరుగులు చేసింది. బ్యాడ్ లైట్ కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో అంపైర్లు వీజేడీ పద్దతిన 11 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్ గెలిచినట్లు ప్రకటించారు. శుభమ్ అరోరా(131 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 136 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రిషీధావన్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అమిత్ కుమార్(79 బంతుల్లో 6 ఫోర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. తమిళనాడు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్.. రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మురగణ్ అశ్విన్, బాబా అపరజీత్ తలో వికెట్ తీశారు. విజయానంతరం హిమాచల్ ప్రదేశ్ ఆటగాళ్ల సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా..
315 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్‌కు ఓపెనర్లు శుభమ్ అరోరా, ప్రశాంత్ చోప్రా(21) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించిన అనంతరం ప్రశాంత్ చోప్రాను సాయి కిషోర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన దిగ్విజయ్ రాంగీ(0) డకౌటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నిఖిల్ గంగ్టా(18)తో శుభమ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని మురుగణ్ అశ్విన్ విడదీశాడు. నిఖిల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
148 పరుగుల భాగస్వామ్యంతో..
దాంతో క్రీజులోకి అమిత్ కుమార్(74) రాగా.. శుభమ్ అరోరా దూకుడు కనబర్చాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న శుభమ్.. మరింత ధాటిగా ఆడాడు. అమిత్ కుమార్ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం.. తమిళనాడు ఆశలు వదులుకుంది. అయితే అమిత్ కుమార్‌ను బాబా అపరిజిత్ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 148 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషీ ధావన్‌తో కలిసి శుభమ్ అరోరా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
దినేశ్ కార్తీక్ సెంచరీ..
అంతకుముందు తమిళనాడు క్రికెటర్, టీమిండియా స్టార్ దినేశ్ కార్తీక్ సెంచరీతో చెలరేగాడు. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును దినేశ్ కార్తీక్, బాబా ఇంద్రజిత్‌తో కలిసి ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇంద్ర జిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఇంద్ర జిత్ ఔటైన కొద్దిసేపటికే దినేశ్ కార్తీక్ కూడా కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్డ్ హిట్టర్ షారూఖ్ ఖాన్ ధాటిగా ఆడటంతో తమిళనాడు 300 ప్లస్ స్కోర్ చేయగలిగింది. ధాటిగా ఆడే క్రమంలో షారూఖ్ ఔటవ్వడం తమిళనాడు కొంపముంచింది. ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ఉంటే తమిళనాడు మరో 20 పరుగులు అదనంగా చేసిది. అప్పుడు గెలవడానికి ఆస్కారం ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications