న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Vijay Hazare Trophy: ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన ధోనీ శిష్యుడు!

 Vijay Hazare Trophy: CSKs Rajvardhan Hangargekar smashes a six when needed 4 on the last ball

రాంచీ: దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్, మహరాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను కనువిందు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టెయిలండర్ సూపర్ బ్యాటింగ్‌తో మహరాష్ట్ర విజయాన్నందుకుంది. మహరాష్ట్ర విజయానికి చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉండటంతో బెంగాల్ విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ మహారాష్ట్ర టెయిలండర్ రాజవర్థన్ హంగార్గేకర్ సిక్స్ బాది అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు.

దాంతో మహారాష్ట్ర ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను బెంగాల్ చేజార్చుకుంది. గ్రూప్-ఈలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సుదిప్ కుమార్(132 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 127) సెంచరీ చేయగా.. షెహ్‌బాజ్ అహ్మద్(64 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌తో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతోరాణించాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి, రాజవర్ధన్ హంగార్గేకర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మనోజ్, సత్యజీత్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆ జట్టులో అంకిత్ బావ్నే(97 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 106) సెంచరీతో రాణించగా.. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(42 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40), కేదార్ జాదవ్(55 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42) పర్వాలేదనిపించారు. అయితే చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన స్థితిలో రాజవర్ధనే(6 బంతుల్లో సిక్సర్‌తో 9 నాటౌట్) సిక్సర్‌తో చిరస్మరణీ విజయాన్నందించాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం క్రికెట్‌లో చాలా గొప్ప విషయమని నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.


అండర్ 19 ప్రపంచకప్‌తో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన రాజవర్దనే హంగార్గేకర్.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ. కోటి యాబై లక్షల భారీ ధరకు అమ్ముడయ్యాడు. ఈ యువ పేసర్‌ను సీఎస్‌కే పోటీ పడి తీసుకుంది. కానీ తుది జట్టులో ఒక్క అవకాశం ఇవ్వలేకపోయింది. అయితే ధోనీ శిక్షణలో రాటు దేలిన రాజవర్దనే.. ఇలా బ్యాటింగ్‌లో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలానే ఆడితే సీఎస్‌కే జట్టులో రాజవర్థన్ కీలకం అవుతాడని అంచనా వేస్తున్నారు.
Story first published: Tuesday, November 15, 2022, 18:31 [IST]
Other articles published on Nov 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X