Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన్మయ్‌, తిలక్‌ సెంచరీలు.. అయినా హైదరాబాద్‌కు నిరాశే! ఆంధ్ర అదరహో!

Vijay Hazare Trophy: Andhra qualifies for quarters, Hyderabad pulls off win

సూరత్‌: కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (131 బంతుల్లో 150; 19 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్టార్ బ్యాట్స్‌మన్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ (127 బంతుల్లో 128; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలు చేయడంతో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ మరో విజయం సాధించింది. ఆదివారం గోవాతో జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ 'ఎ' చివరి లీగ్‌ మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో నెగ్గింది. ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు విజయంతో లీగ్‌ దశను ముగించినా.. నాకౌట్‌ దశకు మాత్రం అర్హత సాధించలేకపోయింది. అయితే హైదరాబాద్‌ ఎలైట్‌ గ్రూప్‌-ఎలో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

తన్మయ్‌, తిలక్‌ సెంచరీలు

తన్మయ్‌, తిలక్‌ సెంచరీలు

ముందుగా హైదరాబాద్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు సాధించింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్, తిలక్‌ వర్మ సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 264 పరుగులు జతచేశారు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో హైదరాబాద్‌ తరఫున తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2002లో గోవాపై అంబటి రాయుడు, వినయ్‌ కుమార్‌ తొలి వికెట్‌కు 196 పరుగులు జోడించారు. 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా 50 ఓవర్లలో 5 వికెట్లకు 343 పరుగులు సాధించి ఓడిపోయింది. ఓపెనర్‌ ఏక్‌నాథ్‌ కేర్కర్‌ (169 నాటౌట్‌; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్నేహల్‌ (112 బంతుల్లో 116; 15 ఫోర్లు) రెండో వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఏక్‌నాథ్‌ చివరిదాకా అజేయంగా ఉన్నా గోవాను గెలిపించలేకపోయాడు.

ఆంధ్ర ఘన విజయం

ఆంధ్ర ఘన విజయం

ఆంధ్ర క్రికెట్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్‌ 'బి' చివరి లీగ్‌ మ్యాచ్‌లో హనుమ విహారి నాయకత్వంలోని ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జార్ఖండ్‌ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర కేవలం 9.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అశ్విన్‌ హెబ్బర్‌ (18 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్‌ (27 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌ బౌలర్లు వరుణ్‌ ఆరోన్‌ 2 ఓవర్లలో 30 పరుగులు, షాబాజ్‌ నదీమ్‌ 2 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చారు. అంతకుముందు జార్ఖండ్‌ 46.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు హరిశంకర్‌ రెడ్డి (4/30), షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ (2/30), కార్తీక్‌ రామన్‌ (2/38) జార్ఖండ్‌ పతనాన్ని శాసించారు.

తృటిలో డబుల్‌ సెంచరీ మిస్

పంజాబ్‌తో జరిగిన గ్రూప్‌ 'బి' మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (146 బంతుల్లో 198; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) తృటిలో డబుల్‌ సెంచరీని కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌ 50 ఓవర్లలో 3 వికెట్లకు 402 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్‌ 42.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పంజాబ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (49 బంతుల్లో 104; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీ చేశాడు.

కర్ణాటక విజయం

కర్ణాటక విజయం

రైల్వేస్‌తో జరిగిన గ్రూప్‌ 'సి' మ్యాచ్‌లో కర్ణాటక 10 వికెట్ల తేడాతో నెగ్గింది. 285 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో భారత గడ్డపై ఇదే అత్యధిక ఛేదన. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (145 నాటౌట్‌; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు), సమర్థ్‌ (130 నాటౌట్‌; 17 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. అంతకుముందు ప్రథమ్‌ సింగ్‌ (129; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయడంతో రైల్వేస్‌ 9 వికెట్లకు 284 పరుగులు చేసింది.

India vs England: 'నాలుగో టెస్టుకు పిచ్‌ మారకుంటే.. టీమిండియా పాయింట్లలో కోత విధించాలి'

Story first published: Monday, March 1, 2021, 10:42 [IST]
Other articles published on Mar 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+