
కర్నాటకకు భారీ లక్ష్యం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేయగా.. పృథ్వీ షా భారీ సెంచరీతో 49.2 ఓవర్లలో 322 పరుగులకు కుప్పకూలింది. షాకు తోడుగా షామ్స్ ములాని(45) రాణించగా.. ఇతర ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభించిన పృథ్వీ షా తర్వాత వేగం పెంచాడు. 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణమైన ప్రదర్శనతో జట్టులో చోటు పోగొట్టున్న షా.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.

మయాంక్ రికార్డు బ్రేక్..
ఈ క్రమంలో అతడు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే టోర్నీలో 725 పరుగులు చేసిన పృథ్వీ.. 723 పరుగులతో మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్ధలుకొట్టాడు. ఇక కర్ణాటక బౌలర్లలో విజయ్ కుమార్ వైషాక్ నాలుగు, ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లు తీశారు. శ్రేయాస్ గోపాల్, కృష్ణప్ప గౌతమ్, రొనిత్ మోర్ తలో వికెట్ పడగొట్టారు.

చెలరేగుతున్న పడిక్కల్..
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక కూడా ధీటుగా బదులిస్తుంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్(43 బంతుల్లో 56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో కర్నాటక 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. పడిక్కల్ ఇప్పటికే వరుసగా నాలుగు సెంచరీలు బాది లిస్ట్ ఎ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 729* పరుగులతో ఇదే మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన పృథ్వీ షాను అధిగమించాడు.


Click it and Unblock the Notifications












