Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పృథ్వీ షా సెంచరీ.. సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్టీ!

Vijay Hazare Trophy 2021: Prithvi Shaw, Bowlers Fire Mumbai To 7-Wicket Win Over Delhi

జైపూర్‌: టీమిండియా స్టార్లతో నిండిన ముంబై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన విజయ్ హజారే మ్యాచ్ వన్ సైడెడ్‌గా ముగిసింది. ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న ముంబై యువ ఓపెనర్‌ పృథ్వీషా (89 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 నాటౌట్‌) అజేయ శతకంతో టచ్‌లోకి రావడంతో ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఢిల్లీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హిమ్మత్‌ సింగ్‌ (145 బంతుల్లో 106 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు.

లోయర్‌ ఆర్డర్‌లో వశిష్ట్‌ (70 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 31.5 ఓవర్లలోనే మూడు వికెట్లే కోల్పోయి 216 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ పృథ్వీ షా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (39; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. తర్వాత పృథ్వీకి జతయిన సూర్యకుమార్‌ యాదవ్‌ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ బాదాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో ముంబై విజయం సులువైంది.

ఇతర మ్యాచ్‌ల్లో బెంగాల్, సౌరాష్ట్ర, చండీఢ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, అస్సాం, నాగాలాండ్, తమతమ ప్రత్యర్థులపై విజయాలు సాధించాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో చత్తీస్‌గడ్, హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఇతర మ్యాచ్ ఫలితాలు
బెంగాల్‌: 315/6 (కైఫ్‌ అహ్మద్‌ 75, అనుస్తుప్‌ 58); సర్వీసెస్‌: 245 (రజత్‌ 90, పుల్‌కిత్‌ 53; ఇషాన్‌ పొరెల్‌ 2/31).
జమ్మూకశ్మీర్‌: 279/9 (శుభమ్‌ 68, వివ్రత్‌ శర్మ 66); సౌరాష్ట్ర: 283/7 (చిరాగ్‌ జానీ 93 నాటౌట్, అర్పిత్‌ 66).
హరియాణా: 299/9 (హిమాన్షు రాణా 102, రాహుల్‌ తెవాటియా 73); చండీగఢ్‌: 300/7 (మనన్‌ వొహ్రా 117, అంకిత్‌ 78).
మహారాష్ట్ర: 295/8 (రుతురాజ్‌ గైక్వాడ్‌ 102; వైభవ్‌ అరోరా 4/45); హిమాచల్‌ ప్రదేశ్‌: 236 (అభిమన్యు రాణా 46, రాజ్‌వర్ధన్‌ 4/42).
పుదుచ్చేరి: 273/6 (పారస్‌ డోగ్రా 101, ); రాజస్తాన్‌: 274/4 (మనేందర్‌ సింగ్‌ 115).

Story first published: Monday, February 22, 2021, 10:54 [IST]
Other articles published on Feb 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+