
హెట్ పటేల్ టాప్ స్కోరర్:
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. రావల్ (23), పంచల్ (2), రాహుల్ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీనికితోడు యూపీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండడంతో ఒత్తిడి పెరిగింది. హెట్ పటేల్ (60) టాప్ స్కోరర్. చావ్లా (32) రాణించాడు. యశ్ దయాళ్ మూడు వికెట్లు తీసి గుజరాత్‌ను దారుణంగా దెబ్బతీశాడు. ఫలితంగా గుజరాత్ 48.1 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది.

అక్షదీప్ నాథ్ 50:
అనంతరం 185 పరుగులతో బ్యాటింగ్ ప్రాంభించిన ఉత్తరప్రదేశ్ 42.4 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. 104 బంతులు ఆడిన అక్షదీప్ నాథ్ 8 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. ఉపేంద్రయాదవ్ అజేయంగా 31 పరుగులు చేశాడు. కెప్టెన్ కరణ్ శర్మ 38 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్ గజ రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన అక్షదీప్ నాథ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

ఆకాశమే హద్దుగా చెలరేగిన షా:
ఢిల్లీలోని పాలం ఏ స్టేడియంలో కర్నాటకతో జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో ముంబై 72 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేసి 49.2 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్ అయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 122 బంతుల్లోనే 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 167 పరుగులు చేశాడు. షాకు తోడుగా షామ్స్ ములాని(45) రాణించగా.. ఇతర ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభించిన పృథ్వీ షా తర్వాత వేగం పెంచాడు. 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పడిక్కల్50:
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటకకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మూడు వికెట్లు కోల్పోయినా.. స్టార్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (64 బంతుల్లో 64 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేశాడు. కరుణ్ నాయర్ (29), శ్రేయాస్ గోపాల్ (33), శరత్ (61), గౌతమ్ (28) పోరాడినా ఫలిస్తాం లేకుండా పోయింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు 42.4 ఓవర్లలో కర్ణాటక ఆలౌట్ అయింది. దేశ్‌పాండే, కోటియన్, సోలంకి, ములని తలో రెండు వికెట్లు పడగొట్టారు.
India vs England: ఇప్పటికే ఎన్నో విజయాలు అందించారు.. తొలి టీ20లో వారిద్దరే ఓపెనర్లు: కోహ్లీ


Click it and Unblock the Notifications












