
ఓపెనర్లుగా రోహిత్, రాహుల్:
తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఓపెనింగ్‌పై స్పష్టతనిచ్చాడు. 'రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు దిగుతాడు. ఇద్దరూ నిలకడగా ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని ఇచ్చి ఇప్పటికే ఎన్నో విజయాలు అందించారు. అందుకే వీరిద్దరితోనే ఓపెనింగ్‌కు దిగుతాం. ఈ ఇద్దరిలో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే శిఖర్ ధావన్ మూడో ఓపెనర్‌గా ఉంటాడు. ప్రస్తుతానికి వారిద్దరే మా మొదటి ఓపెనర్లు' అని కోహ్లీ చెప్పాడు. 'మేము ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఫ్రీగా ఆడాలనుకుంటున్నాం. మా జట్టులో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి మా బ్యాట్స్‌మెన్ మరింత స్వేచ్ఛగా ఆడతారు' అని పేర్కొన్నాడు.

సూపర్ ఫామ్‌లో రోహిత్:
ప్రస్తుతం రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 4 మ్యాచుల్లో 345 పరుగులు చేసి 57.50 సగటుతో భారత్ అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు కేఎల్ రాహుల్ గత ఏడాది డిసెంబర్‌లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ నుంచి భారత్ తరఫున పాల్గొనలేదు. ఐపీఎల్ 2020లో రాహుల్ దుమ్ములేపిన విషయం తెగెలిసిందే. రోహిత్, రాహుల్ రాణిస్తే టీమిండియాకు ఎదురుండదు. 14న రెండో టీ20, 16న మూడో టీ20, 18న నాలుగో టీ20, 20న ఐదవ టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆపై 3 వన్డేలు మార్చి 23 నుంచి పుణెలో జరగనున్నాయి.

ఇంగ్లండ్ ఫేవరెట్:
ఈ ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరెట్ అని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ అభిప్రాయపడగా.. విరాట్ కోహ్లీ మాత్రం ఇంగ్లండ్ ఫేవరెట్ అని చెప్పడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియాను ఫేవరెట్‌గా పరిగణించవచ్చా అనే ప్రశ్నకు కోహ్లీ ఇలా బదులిచ్చాడు. 'ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ జట్టును ఈ ఫార్మాట్‌లో ఓడించడం ఎవరికైనా కష్టమమే. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్' అని కోహ్లీ అన్నాడు.

అసలు సమస్య జట్టు కూర్పు:
ప్రస్తుతం భారత్ ముందున్న అసలు సమస్య జట్టు కూర్పు. ఒక్కో స్థానానికి ఇద్దరు పోటీపడుతున్నారు. నైపుణ్యం ప్రకారం కేఎల్ రాహుల్‌కు చోటివ్వడమే న్యాయం. కానీ ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్‌కు గొప్ప రికార్డులున్నాయి. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తే.. కుడి-ఎడమ వ్యూహ ప్రయోజనమూ లభిస్తుంది. గబ్బర్‌కు చోటివ్వాలని కోహ్లీ భావిస్తే.. రాహుల్‌కు మిగిలింది నాలుగో స్థానమే. అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ చోటు గల్లంతవుతుంది. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉండాలంటే శ్రేయస్, సూర్యకు చోటివ్వక తప్పదు. భువీ, చహల్‌కి చోటు ఖాయం. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కీలకమే. రెండో పేసర్‌గా శార్దూల్, చహర్, సైనిలో అవకాశం ఒక్కరి ఉంటుంది.


Click it and Unblock the Notifications

పాక్‌లోనే నైపుణ్యమున్న క్రికెటర్లు ఎక్కువ.. చరిత్ర చూస్తే మాకు ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు: రజాక్










