Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan హైఓల్టేజ్ మ్యాచ్‌‌.. సందడి చేసిన విజయ్ దేవరకొండ!

Vijay Deverakonda Attends India vs Pakistan Match As Promotion Of Liger Movie

దుబాయ్: క్రికెట్‌ ప్రపంచమంతా కళ్లప్పగించి ఎదురు చూసిన భారత్‌-పాకిస్థాన్‌ పోరుకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హజరయ్యాడు. తన లేటెస్ట్ మూవీ లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌లో సందడి చేశాడు. మ్యాచ్‌కు ముందు హోస్ట్‌లతో కలిసి మాట్లాడిన విజయ్ దేవరకొండ భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలని ఆకాంక్షించాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేస్తాడని జోస్యం చెప్పాడు. క్రికెట్‌లో విరాట్ కింగ్ అని, అతను సత్తా చాటుతాడని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సరదాగా చిట్ చాట్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మరాయి.

ఇక స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్‌తో మాట్లాడిన విజయ్ దేవరకొండ దుబాయ్‌లో ఉన్న పరిస్థితిని తెలుగు కామెంటేటర్లతో పంచుకున్నాడు. ఫుల్ క్రౌడ్ మధ్య మ్యాచ్ చూస్తుంటే ప్రత్యేక అనుభూతి కలుగుతుందని చెప్పాడు. జాతీయగీతం వచ్చినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయన్నాడు. ఇక విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని విజయ్ దేవరకొండ తన మనసులోని మాటను బయటపెట్టాడు. రణ్‌వీర్ నటించిన కపిల్ బయోపిక్ 83 మూవీలో కృష్ణమాచారి పాత్ర కోసం తనను అడిగారని, కానీ తనకు కుదరలేదని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ అంటే తనకు చాలా ఇష్టమని విజయ్ తెలిపాడు.

విజయ్‌ను ఇలా చూసిన తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండను చూసి గర్వపడుతున్నామని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన భారత్ అదరగొడుతుంది. వరుస విరామాల్లో పాక్ ఆటగాళ్లను పెవిలియన్ చేర్చింది. భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్‌లో బాబర్ ఆజామ్(10) ఔటవ్వగా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఫకార్ జమాన్(10) ఔటయ్యాడు. దాంతో పాక్ ఆత్మరక్షణలో పడి ఆచితూచి ఆడుతుంది. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 68 పరుగులే చేసింది. క్రీజులో బాబర్ ఆజామ్(29 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(16 నాటౌట్) ఉన్నారు.

రౌడీ స్టార్ విజయ్ ​దేవరకొండ, టాలీవుడ్​మాస్​డైరెక్టర్​పూరి జగన్నాథ్​కలయికలో వచ్చిన చిత్రం లైగర్​. ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచి ఫ్లాప్​టాక్​ను మూటగట్టుకుంటున్న లైగర్​చిత్రంపై, హీరో విజయ్​దేవరకొండపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్‌లో మంచి టాక్ రావడంతో విజయ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు.

Story first published: Sunday, August 28, 2022, 20:52 [IST]
Other articles published on Aug 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+