Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామెంటేటర్లతో చిట్ చాట్.. అమితాబ్‌తో క్విజ్.. ఐపీఎల్ కోసం జియో భారీ ప్లాన్స్!

 Viacom18 in talks with Amitbah Bachchan to hold KBC kind quiz around IPL LIVE Streaming

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 అప్ కమింగ్ సీజన్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను రూ.23,773 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్న వయాకామ్ 18.. ఉచితంగా ప్రసారాలను అందిస్తామని సంచలన ప్రకటన చేసింది. జియో సిమ్ ఉన్న వారందరూ ఎలాంటి రుసుము లేకుండా జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా మ్యాచ్‌లు వీక్షించవచ్చని ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రతీ ఏడాదిలా కాకుండా ఈ సారి అభిమానులకు కొత్త అనుభూతిని పంచే ఏర్పాట్లు వయాకమ్ 18 చేస్తోన్నట్లు తెలుస్తోంది.

మైదానంలో ఉన్నట్లు..

మైదానంలో ఉన్నట్లు..

మ్యాచ్‌లన్నీ 4కే రిజల్యూషన్‌లో క్వాలిటీగా ప్రసారం కానున్నాయి. ఓ మ్యాచ్‌ను పూర్తిగా చూసేందుకు 2జీబీ డేటా అవసరమవుతుందని కూడా టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీతో పాటు 12 ప్రాంతీయ భాషలతో కూడిన కామెంట్రీతో ఐపీఎల్ ప్రసారం కానుంది. ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు రాని భాషల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. 360 డిగ్రీస్‌లో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా వీఆర్ టెక్నాలజీతో మైదానంలో ఉండి మ్యాచ్‌లు చూసే ఫీలింగ్ అభిమానులకు కలిగించనున్నారు.

నచ్చిన కెమెరా యాంగిల్‌లో..

నచ్చిన కెమెరా యాంగిల్‌లో..

టీవీ కెమెరామెన్ చూపించిన యాంగిల్‌లోనే కాకుండా నచ్చిన కెమెరా యాంగిల్ నుంచి మ్యాచ్‌ను చూసే వెసులు బాటు జియో సినిమా యాప్‌లో కల్పించనున్నారు. స్టంప్ యాంగిల్ నుంచి ఆటను చూడాలనుకుంటే యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మ్యాచ్ చూడవచ్చు. అంతేకాకుండా కామెంటేటర్లతో నేరుగా చిట్ చాట్ చేసే అవకాశం కూడా కల్పించనున్నారు. వివాదాస్పద ఔట్లు, అంపైడ్ తప్పుడు నిర్ణయాలపై అప్పటికప్పుడే కామెంటేటర్లతో మాట్లాడే వెసులుబాటు కూడా ఉండనుంది. ఛాట్ విత్ కామెంటేటర్ ఆప్షన్‌ ద్వారా ఈ వెసులుబాటును కల్పించనున్నారు.

అమితాబ్‌తో క్విజ్ ప్రోగ్రామ్..

అమితాబ్‌తో క్విజ్ ప్రోగ్రామ్..

అంతేకాకుండా కౌన్ బనేగా కరోడ్‌పతి తరహాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో ఓ లైవ్ క్విజ్ ప్రొగ్రామ్ కూడా ఏర్పాటు చేయడంపై వయాకామ్ 18 ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమితాబ్‌తో సంప్రదింపులు జరిపినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఈ క్విజ్‌లో గెలిచిన వారికి భారీ బహుమతులు అందజేయనున్నారు. ఇక ప్లేయర్లు, ఫ్రాంచైజీలు, మ్యాచ్‌లు, రికార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గణంకాల రూపంలో తెలుసుకునే వెసులుబాటును కల్పించనున్నారు. ఓటీటీ చరిత్రలోనే కనివినీ ఎరగని రీతిలో మ్యాచ్‌లను ప్రసారం చేయాలని జియో సినిమా భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, February 21, 2023, 15:31 [IST]
Other articles published on Feb 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+