Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వృద్దిమాన్ సాహాపై పరువు నష్టం దావా వేసిన జర్నలిస్ట్! చాటింగ్ టాంపారింగ్ చేశాడంటూ..

Veteran journalist Boria Majumdar to file defamation case against Wriddhiman Saha over screenshot row

న్యూఢిల్లీ: ఇంటర్వ్యూ కోసం తనను ఓ జర్నలిస్ట్ బెదిరించాడంటూ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహా చేసిన ట్వీట్ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ ఆరోపణలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్రిసభ్య కమిటీ నియమించి విచారణ చేపట్టగా.. సాహా సదరు జర్నలిస్ట్ పేరును ఆ కమిటీకి వెల్లడించాడు. అయితే సాహాతో ఇంటర్వ్యూ కోసం చాట్ చేసింది వాస్తవమేనని, కానీ అతను తన మెసేజ్‌లను టాంపర్ చేశాడంటూ ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ ఆరోపించాడు.

నా వాదనను వినండి..

అంతేకాకుండా తన ప్రతిష్టకు భంగం కలిగేలా చేసిన సాహాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం దావా వేసానని పేర్కొన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలని కూడా మజుందార్ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అతను ఓ వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దీనికి 'ఎప్పుడైనా ఓ కథలో రెండు పార్శ్వాలు ఉంటాయి. సాహా నా వాట్సాప్ చాటింగ్‌ను తారు మారు చేసి నా ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. నా వాదనను బీసీసీఐ కూడా వినాలని కోరుతున్నా. నా లాయర్లు ఇప్పటికే సాహాకు పరువు నష్టం దావా కేసుకు సంబంధించిన నోటీసులు అందజేశారు.'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

సాహా ఆ మెసేజ్‌లను టాంపర్ చేశాడు..

సాహా ఆ మెసేజ్‌లను టాంపర్ చేశాడు..

ఇక వీడియోలో సాహా తనకు గత 12 ఏళ్లుగా తెలుసని, ఇప్పటికే అతనితో చాలా ఇంటర్వ్యూలు చేశానని మజుందార్ చెప్పుకొచ్చాడు. ఆ చనువుతోనే అతన్ని ఇంటర్వ్యూ ఇవ్వాలని అడిగానని, అతను సోషల్ మీడియాలో పెట్టిన చాట్స్ తారుమారు చేసినవని, అసలు చాటింగ్ ఇదేనంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ చూపెట్టాడు.

అభిమానుల నుంచి సానుభూతి పొందేందుకే సాహా తనను దోషిగా చూపించే ప్రయత్నం చేశాడని మజుందార్ చెప్పుకొచ్చాడు. సాహా షేర్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ నిశితంగా పరిశీలిస్తే అతను టాంపారింగ్ చేసిన విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నాడు.

విసిగించడంతోనే..

విసిగించడంతోనే..

స్క్రీన్ షాట్స్‌ను ఎడిట్ చేసి ట్వీట్ చేశాడని చెప్పాడు. వాస్తవానికి ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నేపథ్యంలో సాహాతో ఇంటర్వ్యూకు అతని అంగీకారంతనే ముందే ప్లాన్ చేశామన్నాడు. కానీ ఇంటర్వ్యూ ఇస్తానని తమను రెండున్నర గంటలు వేచి ఉంచాడని, ఆ తర్వాత తమ ఫోన్లు ఎత్తలేదని మజుందార్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విసిగిపోయిన తాను అతనితో ఘాటుగా చాట్ చేశానని స్పష్టం చేశాడు. ఈ విషయాలన్నీ బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ ముందు చెప్తానని మజుందార్ పేర్కొన్నాడు.

ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు..

ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు..

ఇక శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై వృద్దిమాన్ సాహా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయమన్నాడని చెప్పాడు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ.. జట్టులో చోటు గురించి తనకు భరోసా ఇచ్చినా సెలెక్టర్లు పక్కనపెట్టేసారని వాపోయాడు.

ఆ వెంటనే ఓ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం తనను బెదిరించాడని స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు. ఈ విషయంలో భారత మాజీ క్రికెటర్లంతా సాహాకు అండగా నిలిచారు. బీసీసీఐ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సాహా ఇప్పటి వరకు ఆ జర్నలిస్ట్ పేరును ప్రకటించలేదు. కానీ వాట్సాప్ చాటింగ్ ఆధారంగా బోరియా మజుందారేనని అభిమానులు గుర్తించారు.

Story first published: Sunday, March 6, 2022, 12:49 [IST]
Other articles published on Mar 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+