Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రసెల్ అన్న మాటతో ఎమోషనల్‌గా ఫీలయ్యా.. నా కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి: వెంకీ

Venky Mysore Recounts Andre Russell Describing His Heroics

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో వీర బాదుడు అంటే మొదటగా గుర్తుకువచ్చేది వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌లే. క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రేవోలు పవర్ హిట్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. వీరందరిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్‌ రసెల్ వీర బాదుడులో ముందు వరుసలో ఉంటాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ అతని స్టామినాకి ఓ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. 19 బంతుల్లోనే 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

18 బంతుల్లో 52 పరుగులు

18 బంతుల్లో 52 పరుగులు

182 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ 129/4తో నిలిచింది. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 52 పరుగులు అవసరమవగా.. ఎవరికీ ఆ జట్టు గెలుపుపై ఆశలు లేవు. అప్పుడు క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 19 బంతుల్లో 4x4, 4x6) తన పవర్ హిట్టింగ్‌తో విరుచుకుపడడంతో.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. అసాధ్యం అనుకున్న చేధనను రసెల్ సుసాధ్యం చేసి చూపించాడు.

భువీ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు:

భువీ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు:

ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పేసర్ సిద్ధార్థ కౌల్ భారీ పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌లో రసెల్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి మొత్తంగా 19 పరుగులు రాబట్టాడు. ఆపై 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. మొత్తంగా 21 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన శుభమన్ గిల్ (18 నాటౌట్: 10 బంతుల్లో 2x6) జట్టును విజయతీరాలకు చేర్చాడు. రసెల్ హిట్టింగ్‌ చిరస్థాయిగా నిలిచిపోయింది.

రసెల్‌ పరుగులు చేస్తాడా అనుకున్నా:

రసెల్‌ పరుగులు చేస్తాడా అనుకున్నా:

తాజాగా ఆండ్రీ రసెల్ ఇన్నింగ్స్ గురించి కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ గుర్తుచేసుకున్నారు. వెంకీ మైసూర్ మాట్లాడుతూ... 'ఆ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాదిస్తుందని అస్సలు ఊహించలేదు. 17 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 129/4 గా ఉంది. విజయానికి 18 బంతుల్లో 52 పరుగులు చేయాలి. ఇక సన్‌రైజర్స్ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువీ 19వ ఓవర్ వేస్తాడు.. రసెల్‌ పరుగులు చేస్తాడా అని సందేహం నెలకొంది. అయితే 18వ ఓవర్‌లో పరుగులు చేసిన రసెల్‌.. భువీ ఓవర్‌లోనూ భారీగా పరుగులు చేశాడు' అని అన్నారు.

 ఎమోషనల్‌గా ఫీలయ్యా:

ఎమోషనల్‌గా ఫీలయ్యా:

'19వ ఓవర్‌లో భువీ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన ఓ బంతిని రసెల్ కిందపడిపోతూ సిక్స్‌ బాదాడు. మ్యాచ్ తర్వాత ఆ షాట్ ఏంటి? అని రసెల్‌ని అడగ్గా.. నాకు కూడా తెలీదన్నాడు. అప్పుడు నాకు అతడు ఓ విషయం చెప్పాడు. నేను షాట్ ఆడిన తర్వాత స్టేడియంలోని ప్రేక్షకుల రియాక్షన్‌ని మాత్రమే చూస్తానన్నాడు. ఆ మాటకి నేను ఎమోషనల్‌గా ఫీలయ్యా. నా కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. స్టేడియంలోని ప్రేక్షకుల అరుపులు ఆటగాళ్లలో అంతలా ఉత్సాహం నింపుతాయా అని అనుకున్నా. ఇప్పుడు వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 ‌కి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించే అవకాశాలు లేవు' అని 'వెంకీ మైసూర్ పేర్కొన్నారు.

ఐపీఎల్ 2020 ఫైనల్ తేదీ మార్పు.. టోర్నీ చరిత్రలో ఇదే మొదటిసారి!!

Story first published: Thursday, July 30, 2020, 15:44 [IST]
Other articles published on Jul 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+