Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020 ఫైనల్ తేదీ మార్పు.. టోర్నీ చరిత్రలో ఇదే మొదటిసారి!!

BCCI likely to postpone IPL 2020 final from November 8 to 10
IPL 2020 : BCCI Likely To Postpone Final From November 8 To 10 || Oneindia Telugu

ముంబై: సెప్టెంబర్​ 19 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహిస్తామని టోర్నీ పాలక మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఇటీవలే ప్రకటించారు. యూఏఈ వేదికగా జరనున్న ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్‌ని రూపొందించినా.. ఆగస్టు 2న పూర్తి స్థాయిలో షెడ్యూల్ విడుదలవనుంది. అయితే ఐపీఎల్ 2020 సీజన్‌ షెడ్యూల్‌లో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఫైనల్ తేదీ మార్పు

ఫైనల్ తేదీ మార్పు

తాజాగా ఐపీఎల్ 2020 ఫైనల్ తేదీని మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైనల్ తేదీని నవంబరు 8న (ఆదివారం) కాకుండా నవంబరు 10న (మంగళవారం) నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీపావళి వారంలో ఫైనల్ జరుపాలని టోర్నీ బ్రాడ్​కాస్టర్​ స్టార్ ఇండియా కోరడంతో బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తున్నది. పండుగ సమీపంలో ఫైనల్ జరిగితే వ్యూవర్‌షిప్ మరింత అధికంగా వస్తాయని బ్రాడ్​కాస్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ ఫైనల్ నవంబరు 10న జరిగితే.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వీకెండ్‌లో కాకుండా వీక్ మధ్యలో ఫైనల్ నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది.

మల్లగుల్లాలు పడుతున్న బీసీసీఐ

మల్లగుల్లాలు పడుతున్న బీసీసీఐ

మరో మూడు రోజుల్లో జరిగే ఐపీఎల్ పాలక మండలి భేటీలో ఐపీఎల్ ఫైనల్​పై తుది నిర్ణయం జరుగనుంది. ఒకవేళ ఫైనల్ పోరు నవంబర్ 10వ తేదీకి వాయిదా పడితే.. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి రాకుండా యూఏఈ నుంచే వెళ్లే అవకాశం ఉంది. ఐపీఎల్ అనంతరం భారత ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లకుండా.. నేరుగా ఆసీస్ గడ్డకే రావాలని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా కోరుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్ తేదీ మార్పుపై బీసీసీఐ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. మరో మూడు రోజులు ఆగితే అన్ని విషయాలపై స్పష్టమైన క్లారిటీ రానుంది.

మార్చి 29 నుంచి మే 24 వరకు

మార్చి 29 నుంచి మే 24 వరకు

మార్చి 29 నుంచి మే 24 వరకు ఐపీఎల్ 2020‌ని నిర్వహించాలని బీసీసీఐ షెడ్యూల్‌ రూపొందించింది. కరోనా వైరస్ కారణంగా టోర్నీని ఏప్రిల్ 15కి తొలుత వాయిదా వేసిన బీసీసీఐ.. అప్పటికి కూడా దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో నిరవధికంగా వాయిదా వేసింది. ఇక అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడటంతో.. ఆ విండోలో ఐపీఎల్ 2020ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ షెడ్యూల్‌ని ప్రకటించింది. అయితే డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఎక్కువగా ఉండటంతో టోర్నీలో రోజుల్ని పెంచాలని ఫ్రాంఛైజీలు, బ్రాడ్‌కాస్టర్‌ డిమాండ్ చేశాయి. దాంతో టోర్నీని సెప్టెంబరు 19 నుంచే ప్రారంభిస్తామని బీసీసీఐ తెలిపింది.

స్టార్ ఇండియా ఒత్తిడి

స్టార్ ఇండియా ఒత్తిడి

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ జరుగుతుందని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఫ్రాంఛైజీలకి కూడా సమాచారమిచ్చి ఆగస్టు 20 నాటికి జట్లని యూఏఈకి పంపాలని సూచించింది. కానీ తాజాగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా ఒత్తిడితో ఐపీఎల్ ఫైనల్ తేదీని నవంబరు 8 నుంచి 10కి మారనున్నట్లు సమాచారం తెలుస్తోంది. దీపావళి పండగ సందర్భంగా యాడ్స్‌తో పాటు ఫైనల్‌కి వ్యూవర్‌షిప్ మరింత పెరిగే అవకాశం ఉందని బ్రాడ్‌కాస్టర్ భావిస్తోంది.

అది నావల్ల కాదని ఎవరైనా అంటే.. చేసి చూపిస్తా: సానియా

Story first published: Thursday, July 30, 2020, 14:19 [IST]
Other articles published on Jul 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+