For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Venkatesh Iyer: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. చెలరేగేందుకు రెడీగా ఉన్నా

Venkatesh Iyer says The Plans Are Set On His Approach As Indias All-Rounder For South Africa ODIs

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపివ్వడంపై యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. బౌన్సీ, పేస్ పిచ్‌లు ఉన్న సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటేందుకు అన్ని విధాల సిద్దమయ్యానని తెలిపాడు. ఐపీఎల్‌ 2021 సెకండాఫ్ సెన్సేషన్ పెర్ఫామెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన వెంకటేశ్ అయ్యర్.. దేశవాళీ లీగ్‌లో సత్తా చాటి టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నయంగా అయ్యర్‌ను తీర్చిదిద్దాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఇక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వెంకటేశ్ అయ్యర్.. అక్కడి పిచ్​లపై ఎలా రాణించాలనే విషయమై తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నట్లు చెప్పాడు.
"వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటా. అయితే ఏరోజు చేయాల్సిన పనిని ఆరోజే చేస్తా. బౌన్స్​ పిచ్​లపై ఓ బౌలర్​, ఫీల్డర్​, బ్యాటర్​గా ఎలా రాణించాలనేదానిపై కసరత్తులు చేయాలి. సౌతాఫ్రికాకు చేరుకోగానే ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొంటాను. ప్రస్తుతం నా దృష్టంతా సఫారీ పర్యటన పైనే ఉంది. పిచ్​పై ఎలా ఆడాలో నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆల్​రౌండర్​గా ఎదగాలన్నదే నా కల. ఇందుకోసం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్​లోనూ రాణించాలి. నాయకత్వ లక్షణాలు కూడా కనబరచాలి. అవసరమైనప్పుడు కెప్టెన్​కు మంచి సలహాలు ఇవ్వాలి."అని అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్ కాకపోయినా జట్టులో కీలకంగా వ్యవహరించడం అవసరం అని వెంకటేష్ అన్నాడు. దీనిపై శ్రద్ధ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఫినిషర్​గా, టాప్​ ఆర్డర్​ బ్యాటర్​గా ప్రస్తుతం బాగానే రాణిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, January 2, 2022, 19:20 [IST]
Other articles published on Jan 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+