Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: మిస్‌ యూ 'వెంకీమామా': సన్‌రైజర్స్‌

Venkatesh Daggubati sends his wishes to Sunrisers Hyderabad
SRH vs RCB : Venky Mama ని మిస్ అవుతున్న Sun Risers Hyderabad | IPL 2020

హైదరాబాద్: కరోనా వైరస్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. ముగిసింది రెండు మ్యాచ్‌లే అయినా.. క్రికెట్‌ అభిమానులకు అసలైన మజాను అందించాయి. బ్యాట్స్‌మన్‌, బౌలర్ల పోరాటాలను నేరుగా మైదానాల్లోకి వెళ్లి చూడకున్నా.. టీవీల్లోనే చూస్తూ సొంత జట్ల అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌ 2020లో భాగంగా ఈరోజు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ)‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌‌ (ఎస్‌ఆర్‌హెచ్) జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. దుబాయ్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు.

విక్టరీ విషెస్‌

విక్టరీ విషెస్‌

ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం తెలుగు రాష్ట్రాల అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ సీనియర్‌ హీరో 'విక్టరీ' వెంకటేష్‌ హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టుకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. తొలి మ్యాచ్‌లో ఆడుతున్నందున విషెస్‌ తెలియజేసిన వెంకీమామ.. తమ మద్దతు ఎప్పుటికీ ఉంటుందని మరోసారి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 'సన్‌రైజర్స్ బృందానికి శుభాకాంక్షలు. మిమ్మల్నెప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాను' అని వెంకటేష్‌ పేర్కొన్నారు.

మిస్‌ యూ వెంకీమామా

మిస్‌ యూ వెంకీమామా

హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఆరెంజ్‌ ఆర్మీ) బదులిచ్చింది. 'స్టాండ్స్‌లో ఉండి ప్రోత్సహించే మిమ్మల్ని మేం మిస్సవుతాం వెంకీమామా' అని రీట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. క్రికెట్‌ అంటే వెంకీమామాకు పిచ్చి. తెలుగు హీరోల జట్టు తరఫున ఆయన బరిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఉప్పల్ మైదానంలో మ్యాచ్ ఉందంటే.. వెంకటేష్‌ కచ్చితంగా హాజరవుతారు. భారత్, సన్‌రైజర్స్ జట్ల మ్యాచులను ఎంజాయ్ చేస్తారు. సొంత జట్టుకు మద్దతు విషయంలో వెంకీమామా ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

గుడ్‌లక్‌ చెప్పిన మంచు మనోజ్

గుడ్‌లక్‌ చెప్పిన మంచు మనోజ్

ప్రతి సంవత్సరం వెంకటేష్‌తో పాటు రానా, నాని, సుశాంత్‌, ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్ వంటి ఎందరో తారలు ఉప్పల్‌ మైదానానికి వచ్చి హైదరాబాద్‌ను ప్రోత్సహించే సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ హీరోలు మంచు విష్ణు, మనోజ్‌తో సహా మరికొంత మంది సన్‌రైజర్స్‌కు గుడ్‌లక్‌ చెప్పారు. ఈ రోజు మ్యాచ్ కోసం వారందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ఇదే తొలి మ్యాచ్. ఇక విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్‌ మజా అందనుంది.

సానియా విషెష్:

సానియా విషెష్:

కోహ్లీసేనతో తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతున్న సందర్భంగా పలువురు సెలబ్రిటీలు మన జట్టుకు శుభాకాంక్షలు చెప్పారు. బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌‌ పీవీ సింధు, టెన్నిస్‌ తార సానియామిర్జా, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్‌ ప్రత్యేక వీడియోల్లో అభినందనలు తెలిపారు. 'యూఏఈలో ఉంటే ఇంట్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. మ్యాచును మైదానంకు వెళ్లి చూడలేము' అని సానియా తన వీడియోకి పోస్ట్ పెట్టారు. నా అభిమాన జట్టు హైదరాబాద్‌ టీంకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.

లీడ్‌లో సన్‌రైజర్స్

లీడ్‌లో సన్‌రైజర్స్

ఐపీఎల్ 2020 జర్నీని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ ఇరు జట్లు 15 సార్లు తలపడగా.. 8-6తో సన్‌రైజర్స్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు. తొలుత బౌలింగ్ అనుకూలిస్తూ.. తర్వాత బ్యాటింగ్‌కు సులువయ్యే పరిస్థితులుంటాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

నా సక్సెస్‌ వెనుక అసలు కారణం అదే: రాయుడు

Story first published: Tuesday, September 22, 2020, 9:30 [IST]
Other articles published on Sep 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+