Varun Chakravarthy: బౌలింగే కాదు జీవితమంతా మిస్టరినే! వికెట్ కీపర్‌గా మొదలు పెట్టి..

హైదరాబాద్: శ్రీలంక పర్యటనలో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ సిద్దంగా ఉన్నాడు. అయితే అతని బౌలింగే కాకుండా జీవిత ప్రయాణం కూడా మిస్టరీగానే ముందుకు సాగుతుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున దుమ్మురేపిన 29 ఏళ్ల చక్రవర్తి గతేడాదే టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. కానీ భుజ గాయం కారణంగా ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత స్వదేశం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అవకాశం దక్కింది. అది కూడా యోయో ఫిట్‌నెస్ టెస్ట్ అధిగమించకపోవడంతో చేజారింది. కానీ శ్రీలంక పర్యటనలో అతనికి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

వికెట్ కీపర్‌గా మొదలుపెట్టి..
ప్రస్తుతం మిస్టరీ స్పిన్నర్‌గా దుమ్మురేపుతున్న వరుణ్ చక్రవర్తీ.. మొదట వికెట్ కీపర్‌గా తన క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. 13 ఏళ్ల వయసులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ప్రారంభించిన అనతు 17 ఏళ్ల వరకు ఆడాడు. పెద్దగా రాణించకపోవడంతో క్రికెట్‌ను పక్కనపెట్టేసి చదువుపై దృష్టిసారించాడు. ఎస్ఆర్‌ఎమ్ యూనివర్సిటీలో అర్కిటెక్చర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్రిలాన్స్ ఆర్కిటెక్చర్‌గా పనిచేశాడు. కానీ అతనికి ఆ పని కిక్ ఇవ్వలేదు. దాంతో మళ్లీ 23 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.

మీడియం పేసర్‌గా..
అయితే ఈసారి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కాకుండా మీడియం పేసర్ అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ మొకాలి గాయం కావడంతో పేస్ బౌలింగ్‌ను వదిలేసి స్పిన్నర్‌గా అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్‌లో స్పిన్నర్స్‌ను బాగా కొడతారని భావించిన వరుణ్ చక్రవర్తి.. తన స్పిన్‌కు పేస్‌ను జోడించి విభిన్నమైన వేరియేషన్స్‌లో బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, క్యారమ్ బాల్స్, ఆర్మ్ బాల్స్ ఇలా మొత్తం ఏడురకాల వేరియేషన్స్ తో బౌలింగ్ చేసేవాడు. ఒకే ఓవర్‌లో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ వంటి విభిన్నమై వేరియేషన్స్‌తో బంతులు వేయడం, దానికి పేస్ జోడించడంతో పిక్ చేయడానికి బ్యాట్స్‌మన్ తెగ ఇబ్బంది పడేవాడు.

టీఎన్‌పీఎల్ టర్నింగ్ పాయింట్..
దాంతో చెన్నై ఫోర్త్ డివిజన్ లీగ్‌లో ఆడే అవకాశం అతనికి దక్కింది. అక్కడ చాలా వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తమిళనాడు రంజీ ట్విన్ బ్రదర్స్ బాబా అపరిజిత్, ఇంద్రజిత్ అతని బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని ఏ డివిజన్‌లో ఆడించారు. ఆక్కడి నుంచి టీఎన్‌పీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. మథురై పాంథర్స్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. అప్పటి వరకు బాగా ఆడని ఆ జట్టు 2018లో అతని చేరికతో దుమ్మురేపింది. ఏకంగా టైటిల్ గెలిసింది. దాంతో అతనికి మంచి హైప్ వచ్చింది. దాంతో అతని సీఎస్‌కే నెట్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా అతని టాలెంట్‌ను గుర్తించి కేకేఆర్ నెట్స్‌లో బౌలింగ్ చేయించాడు. అక్కడ సునీల్ నరైన్ సాయంతో వరుణ్ కొన్ని మెళకువలు నేర్చుకున్నాడు.

రూ. 8.4 కోట్ల భారీ ధర..
ఇక 2019లో ఐపీఎల్ వేలంలో రూ.8.4 కోట్లకు కింగ్స్ పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది. సీఎస్‌కే, కింగ్స్ పంజాబ్, కేకేఆర్ అతని కోసం వేలంలో పోటీపడటంతో ధర అమాంతం పెరిగిపోయింది. కానీ ఆ సీజన్‌లో ఓకే ఒక మ్యాచ్ ఆడిన వరుణ్... తన అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 35 రన్స్ ఇచ్చి ఒక్క వికెటే తీసాడు. ఆ తర్వాత ఫింగర్ ఇంజ్యూరీ అయింది. కింగ్స్ పంజాబ్ కూడా అతన్ని వదులుకుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో దినేశ్ కార్తీక్ పట్టుబట్టి కేకేఆర్ మేనేజ్‌మెంట్‌తో రూ.4 కోట్లకు కొనుగోలు చేయించాడు. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. తాజా సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాడు. 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. శ్రీలంక పర్యటనలో వరుణ్ చక్రవర్తి దుమ్మురేపితో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఖాయమని, ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తే స్టార్ క్రికెటర్‌గా ఎదిగే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications