Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

TNPL 2025: వరుణ్ చక్రవర్తీ సంచలన బ్యాటింగ్.. ఆఖరి 2 బంతులకు 6, 4 కొట్టి గెలిపించిన మిస్టరీ స్పిన్నర్(వీడియో)

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ బ్యాట్‌తో సంచలన ప్రదర్శన కనబర్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)‌లో దిండిగల్ డ్రాగన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తీ.. ఆదివారం ఎస్‌కేఎమ్ సేలం స్పార్టన్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా తరలించి చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.

వరుణ్ చక్రవర్తీ సూపర్ బ్యాటింగ్‌తో దిండిగల్ డ్రాగన్స్ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. దాంతో ఆ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Varun Chakravarthy Smashes Final-Ball Six and Four for TNPL 2025 Thriller video

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌కేఎమ్ సేలం జట్టు 188 పరుగులు చేసింది. లక్ష్యచేధనకు దిగిన దిండిగల్ డ్రాగన్స్‌కు ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్‌ వేసిన సేలం పేసర్ పోయ్యిమోజీ తొలి నాలుగు బంతులను కట్టడిగా వేసి 3 పరుగులు ఇవ్వడంతో పాటు ఓ వికెట్ కూడా తీసాడు. దాంతో చివరి 2 బంతుల్లో డ్రాగన్స్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.ఈ పరిస్థితుల్లోనే అతను నోబాల్ వేసాడు. దాంతో ఫ్రీహిట్ లభించగా.. వరుణ్ చక్రవర్తీ లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. చివరి బంతిని బౌండరీ తరలించి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ గెలుపుతో దిండిగల్ డ్రాగన్స్ జట్టు ఆటగాళ్లు ఎగిరి గంతేసారు.డగౌట్‌లో కూర్చున్న అశ్విన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఛేజింగ్‌లో అశ్విన్ ఓపెనర్‌గా అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు.బౌలింగ్‌లో 22 పరుగులిచ్చిన 3 వికెట్లు తీసాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన దిండిగల్ డ్రాగన్స్ మూడింటిలో గెలిచింది. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై అశ్విన్ టీమ్ కన్నేసింది.

Story first published: Monday, June 23, 2025, 16:43 [IST]
Other articles published on Jun 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+