Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ టూర్‌కు వరుణ్ చక్రవర్తి డౌట్.. సెలెక్టర్లపై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్!

Varun Chakravarthy reportedly struggling with shoulder injury ahead of Australia tour

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో సూపర్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికైన కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ భుజ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ భుజ గాయం అతని బౌలింగ్‌పై ప్రభావం చూపకపోయినప్పటికి ఫీల్డింగ్‌లో బంతిని విసరలేకపోతున్నాడని తాజాగా ఓ రిపోర్ట్ వెల్లడించింది. . బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకుల మధ్య సమన్వయం లోపం కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని స్పష్టం చేసింది. ఐపీఎల్‌లో ఏ ఆటగాడైనా గాయపడితే నిర్వాహకులు బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని బీసీసీఐ ఫిజియో టీమ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలు కలుగుతుంది.

ఐపీఎల్‌లో వరుణ్‌ గాయపడినా సమాచారం ఇవ్వని ఐపీఎల్‌ నిర్వాహకులు.. అతన్ని మిగతా మ్యాచ్‌లలోనూ కొనసాగించారు. బంతిని దూరం విసరడానికి ఇబ్బందిపడ్డ వరుణ్‌ని 30 మీటర్ల సర్కిల్‌లోనే ఫీల్డింగ్‌ చేయించినట్టు స‍్టడీ రిపోర్టు పేర్కొంది. ఇక వరుణ్ గాయపడ్డ విషయం సెలెక్టర్లకు తెలియదని ఓ బీసీసీఐ అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాడు.'వరుణ్ భుజ గాయం విషయం సెలెక్టర్లకు తెలియదు. కేకేఆర్ మేనేజ్‌మెంట్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వరుణ్‌ను ఆసీస్‌కు పంపిచేది లేనిది సెలెక్టర్లే నిర్ణయిస్తారు'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

వరుణ్ గాయానికి సంబంధించిన వార్తలతో మరోసారి ఆస్ట్రేలియా టూర్ టీమ్స్ ఎంపికపై దుమారం రేగుతుంది. ఈ టూర్‌కు జట్లను ఎంపిక చేసిన భారత సెలక్షన్‌ కమిటీ వ్యవహారంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. తొడ కండరాలకు గాయాన్ని సాకుగా చూపి రోహిత్‌ శర్మను పక్కన పెట్టిన సెలక్టర్లు.. భుజం నొప్పితో బాధపడుతున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని టీ20 సిరీస్‌కు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా పలు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రోహిత్‌ పాల్గొనలేదు. అనంతరం ఢిల్లీతో జరిగిన ప్లేఆఫ్స్‌లో క్రీజులోకి వచ్చాడు. దాంతో రోహిత్‌ను కావాలనే తప్పించారనే వాదన బలంగా వినిపించింది. ఇక నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరుగనుంది.

Story first published: Monday, November 9, 2020, 15:09 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+