Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే వరుణ్ చక్రవర్తీ ఆడటం లేదు: అజింక్యా రహానే

వరుణ్ చక్రవర్తీ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. దాంతోనే లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుండగా.. కేకేఆర్‌లో ఒక మార్పు చోటు చేసుకుంది.

చేతి గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ఈ మ్యాచ్‌ కూడా ఆడటం లేదు. సునీల్ నరైన్ రీఎంట్రీ ఇవ్వగా.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేసేందుకు సిద్దమైతే బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుందని టాస్ సందర్భంగా అజింక్యా రహానే తెలిపాడు.

వరుణ్ కోలుకోలేదు..

'టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఇక్కడే జరిగిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ పూర్తి కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఏదైనా జరగవచ్చు. మా తుది జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేశాం. బ్లెస్సింగ్ స్థానంలో సునీల్ నరైన్ జట్టులోకి వచ్చాడు. వరుణ్ ఇంకా తన చేతి గాయం నుంచి కోలుకుంటున్నాడు.

Varun Chakravarthy Misses Out Against LSG Ajinkya Rahane Reveals Injury Update for KKR s Star Spinner

ఒకవేళ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయడానికి సిద్దమైతే.. మా బౌలింగ్ కాంబినేషన్ ఇంకా మెరుగుపడుతుంది. ప్రస్తుతం రోవ్‌మన్ పావెల్ ఆడుతున్నాడు. కానీ గ్రీన్ బౌలింగ్ చేస్తే మాకు అదనపు బౌలర్ అందుబాటులో ఉంటాడు. బ్యాటింగ్ యూనిట్‌గా మేం అనవసరమైన ఒత్తిడి పెంచుకోకుండా, బంతిని గమనిస్తూ దానికి తగ్గట్లుగా ఆడాలనుకుంటున్నాం. ఏదో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ముందుగానే ఊహించుకుని దాని కోసం కష్టపడటం కంటే.. క్రీజులో ఉన్నప్పుడు బంతిని జాగ్రత్తగా చూస్తూ స్పందించడమే ముఖ్యం అని నేను భావిస్తున్నా.'అని రహానే చెప్పుకొచ్చాడు.

కేకేఆర్ పని పట్టేందుకే..

కేకేఆర్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతోనే బౌలింగ్ ఎంచుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనేది మా ఆలోచన. నేను గతంలో చెప్పినట్లుగా.. మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తారనే నమ్మకం ఉంది. గత మ్యాచ్ విజయం జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టించింది.

మేం ఎప్పుడూ సానుకూలంగా ఉంటూ.. విజయానికి కావాల్సిన విషయాల గురించి చర్చించుకుంటాం. గెలిచినప్పుడు జట్టులోని అందరూ ఏకతాటిపైకి రావడం చూసి చాలా సంతోషం కలిగింది. ఈ మ్యాచ్‌లో మేం విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. బ్యాటింగ్ పరంగా మా టాప్ ఆర్డర్ బలంగా ఉంది. ఇన్నింగ్స్ మొత్తం వారు జట్టును నడిపిస్తారని మేం నమ్ముతున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

లక్నో సూపర్ జయంట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి.

Story first published: Thursday, April 9, 2026, 19:32 [IST]
Other articles published on Apr 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+