టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ చరిత్ర సృష్టించాడు. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో 10 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో వరుణ్ చక్రవర్తీ (5/24) ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. తొలి టీ20లో 3 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తీ రెండో టీ20లో 2 వికెట్లు పడగొట్టాడు.
సౌతాఫ్రికా పర్యటనలోనూ 4 టీ20ల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తీ తర్వాత అశ్విన్, రవి బిష్ణోయ్ ఉన్నారు. శ్రీలంకతో 2016లో అశ్విన్ 9 వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్ 2023లో ఐర్లాండ్‌తో సిరీస్‌లో 9 వికెట్లు పడగొట్టాడు.

ఈ సిరీస్‌లోనూ వరుణ్ చక్రవర్తీ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తీ కన్నా ముందు భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఈ ఫీట్ సాధించారు. యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ చెరోసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ తరఫున 21 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తీ.. ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం విజయ్ హజారే ట్రోఫీ 2023లో 19 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తీ.. మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తన రీఎంట్రీలో 10 మ్యాచ్‌ల్లోనే వరుణ్ చక్రవర్తీ 27 వికెట్లు పడగొట్టాడు. అతని యావరేజ్ 10.96గా ఉండగా ఎకానమీ 7.40 ఉంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీతో పాటు హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.